Kejriwal: ఒక్కొక్కరికి 25 కోట్ల రూపాయలు ఆశ చూపారు

Arvind Kejriwal Sensational Comments
x

Kejriwal: ఒక్కొక్కరికి 25 కోట్ల రూపాయలు ఆశ చూపారు

Highlights

Kejriwal: తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ ప్రయత్నించింది

Kejriwal: ఢిల్లీలో ఆప్ సర్కార్, కేంద్రం మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ బీజేపీపై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నించిందన్నారు. ఒక్కొక్కరికి 25 కోట్ల రూపాయలు ఆశ చూపి, ఏడుగురు ఎమ్మెల్యేల కొనుగోలుకు కుట్ర పన్నిందని సోషల్ మీడియా వేదికగా కేజ్రీవాల్ విమర్శలు చేశారు.

ఇటీవల బీజేపీ నేతలు.. ఏడుగురు ఆప్ ఎమ్మెల్యేలను సంప్రదించారని కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొద్ది రోజుల్లో కేజ్రీవాల్‌ అరెస్టు అవుతారని అసత్య ప్రచారం చేస్తున్నారని, తర్వాత మేం ఆప్‌ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం. మీరు కూడా రావొచ్చు. అందుకు 25 కోట్లు ఇస్తాం. అలాగే బీజేపీపై టికెట్‌పై ఎన్నికల్లో పోటీ చేయొచ్చని మా ఎమ్మెల్యేలతో మాట్లాడారని కేజ్రీవాల్ ఆరోపించారు.

తనను అరెస్టు చేసేది మద్యం కుంభకోణం కేసులో విచారించేందుకు కాదని దీనినిబట్టి అర్థమవుతోంది. మా ప్రభుత్వాన్ని కూల్చేందుకు వారు కుట్ర పన్నుతున్నారు. గత 9 ఏళ్లలో వారు ఇలాంటి ప్రయత్నాలు ఎన్నో చేసినా విజయం సాధించలేకపోయారు. ప్రజల మద్దతు ఎప్పుడూ తమకే. మా ఎమ్మెల్యేలు కలిసికట్టుగా ఉన్నారు. వారి ఆఫర్‌ను తిరస్కరించారు. ఈసారి కూడా వారి కుట్రలు భగ్నమవుతాయని కేజ్రీవాల్ పోస్టు పెట్టారు. ఆప్‌ ప్రభుత్వం అందిస్తోన్న సుపరిపాలన వల్లే ఈ యత్నాలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories