Kejriwal: పంజాబ్ లోనూ పాగా వేసేందుకు కేజ్రీవాల్ స్కెచ్

Arvind Kejriwal Announces Free Electricity and Water for Punjab If AAP Wins
x

కేజ్రీవాల్: (ఫైల్ ఇమేజ్)

Highlights

Kejriwal: ఢిల్లీలో ఉచిత విద్యుత్ అందించి, విజయం సాధించిన కేజ్రీవాల్ ఇదే ఉచితాన్ని పంజాబ్‌లోనూ అమలు చేయాలని భావిస్తోంది.

Kejriwal: రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ ఇప్పటినుంచే పంజాబ్‌లో పాగా వేసేందుకు ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీలో ఉచిత విద్యుత్ అందించి, విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇదే ఉచితాన్ని పంజాబ్‌లోనూ అమలు చేయాలని భావిస్తోంది. మరోవైపు సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనకు కూడా 'ఆప్' మద్దతు పలుకుతూ, పంజాబ్ రైతులకు అండగా నిలిచింది.

పంజాబ్... వీరుల జన్మస్థలం...

'ఆప్' జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కిసాన్ మహాసమ్మేళన్‌లో మాట్లాడుతూ పంజాబ్... వీరుల జన్మస్థలమని, అటువంటివారిని స్మరించుకోవాలని అన్నారు. దేశంలో ఎక్కడ అన్యాయం జరిగినా దానికి వ్యతిరేకంగా ముందుగా పంజాబ్ తన గొంతు వినిపిస్తుందన్నారు. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పడితే ఢిల్లీలో మాదిరిగానే ఉచితంగా విద్యుత్, నీరు అందిస్తామన్నారు. మోదీ ప్రభుత్వం పార్లమెంట్‌లో వ్యవసాయ బిల్లులు ప్రవేశపెట్టి ముఖ్యమంత్రి అధికారాలను కూడా లాక్కున్నదని ఆరోపించారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశరాజధానిలో ఆందోళన చేస్తున్న రైతులకు ఎటువంటి నష్టం లేకుండా అండగా వుంటామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories