మరో పార్టీ వ్యతిరేకత.. హర్యానాలో ఎన్డీఏ సర్కార్ కుప్పకూలే అవకాశం?

మరో పార్టీ వ్యతిరేకత.. హర్యానాలో ఎన్డీఏ సర్కార్ కుప్పకూలే అవకాశం?
x
Highlights

మరో పార్టీ వ్యతిరేకత.. హర్యానాలో ఎన్డీఏ సర్కార్ కుప్పకూలే అవకాశం? మరో పార్టీ వ్యతిరేకత.. హర్యానాలో ఎన్డీఏ సర్కార్ కుప్పకూలే అవకాశం? మరో పార్టీ వ్యతిరేకత.. హర్యానాలో ఎన్డీఏ సర్కార్ కుప్పకూలే అవకాశం?

కేంద్ర ప్రభుత్వం నూతనంగా తెచ్చిన వ్యవసాయ బిల్లులు ఎన్డీఏలో చిచ్చుపెట్టాయి.. ఈ బిల్లులకు వ్యతిరేకంగా అకాలీదళ్ పార్టీ ఎన్డీఏ నుంచి తప్పుకుంది. పార్లమెంటులో బిల్లులను వ్యతిరేకిస్తూ.. కేంద్ర మంత్రి పదవికి హర్‌సిమ్రత్‌ కౌర్‌ రాజీనామా చేసారు కూడా. అయితే ఇది మరువక ముందే బీజేపీకి మరో షాక్ తగిలేలా ఉంది. హర్యానాలో బిజెపికి మిత్రపక్షంగా ఉన్న జానాయక్ జనతా పార్టీ (జెజెపి) కూడా బిల్లులకు నిరసనగా ఎన్డీఏ నుంచి బయటకు రావాలని భావిస్తోంది. ఎన్డీఏ నుంచి వైదొలగాలంటూ ఆ పార్టీ అధ్యక్షుడు దుష్యంత్ సింగ్ చౌతాలాపై ఒత్తిడి పెరుగుతోంది, దీంతో రాష్ట్రంలో సంకీర్ణ సర్కారు కుప్పకూలే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం దుష్యంత్ చౌతాలా హర్యానా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ రోజు తెల్లవారుజామున ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ‌తో సమావేశమయ్యారు, అనంతరం తన పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు.

90 అసెంబ్లీ స్థానాలున్న హర్యానాలో ఖట్టర్‌ నేతృత్వంలోని బీజేపీ 40 స్థానాలు సాధించి.. అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్‌ (46)ను సొంతంగా సాధించకపోవడంతో. దీంతో పది స్థానాలు సాధించిన దుష్యంత్‌ చౌతాలా కింగ్‌మేకర్‌గా అవతరించారు. వెంటనే జెజెపి కూడా బీజేపీతో కలిసిపోయింది. దీంతో జేజేపీ మద్దతుతో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే జెజెపి గనక ప్రభుత్వం నుంచి వైదొలిగితే హర్యానాలో ఎన్డీఏ సర్కార్ కుప్పకూలుతుందని రాజకీప విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు దుష్యంత్‌ చౌతాలా ను బుజ్జగించే పనిలో పడింది బీజేపీ. అయితే కేంద్రం ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ బిల్లులను వెనక్కితీసుకుంటేనే తాము ప్రభుత్వంలో కొనసాగుతామని దుష్యంత్‌ చౌతాలా ఖరాకండిగా చెబుతున్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories