ECI: లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఓటేసేందుకు 96.88 కోట్ల మంది రెఢీ

96 88 Crore People Registered To Vote For The Forthcoming General Elections In India Said Eci
x

ECI: లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఓటేసేందుకు 96.88 కోట్ల మంది రెఢీ

Highlights

ECI: కొత్తగా 2కోట్లమంది ఓటు నమోదు చేసుకున్నారన్న ఈసీ

ECI: కేంద్ర ఎన్నిక‌ల సంఘం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రాబోయే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ఓటేసేందుకు దేశ‌వ్యాప్తంగా 96కోట్ల 88 కోట్ల మంది రిజిస్ట‌ర్ చేసుకున్న‌ట్లు ఈసీఐ వెల్ల‌డించింది. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల కోసం భారీ సంఖ్య‌లో దేశ‌వ్యాప్తంగా ఓట‌రు న‌మోదు జ‌రిగింది. 2019తో పోలిస్తే ప్ర‌స్తుతం రిజిస్ట‌ర్ ఓట్ల సంఖ్య ఆరు శాతం పెరిగిన‌ట్లు భార‌త ఎన్నిక‌ల సంఘం తెలిపింది.

కొత్త‌గా ఓటు రిజిస్ట‌ర్ చేసుకున్న వారిలో మ‌హిళ‌లు, యువ‌త అధిక సంఖ్య‌లో ఉన్నారు. ఈ ఏడాది అత్య‌ధిక సంఖ్య‌లో ఓటు న‌మోదు చేసుకున్న వారిలో పురుషుల క‌న్నా మ‌హిళ‌లే ఎక్కువ‌గా ఉన్నారు. 18 ఏళ్ల నుంచి 29 ఏళ్ల వ‌య‌సులో ఓటు న‌మోదు చేసుకున్న వారిలో రెండు కోట్ల మంది యువ‌త ఉన్నారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఓటు న‌మోదు చేసుకోని వారు ఇంకా త‌మ ఓటును న‌మోదు చేసుకునే అవ‌కాశం ఉన్న‌ట్లు ఈసీఐ వెల్ల‌డించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories