ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో చెలరేగిన హింస.. నలుగురు మృతి.. 250 మందికి గాయాలు

4 Dead, 250 Injured In Uttarakhand Violence
x

ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో చెలరేగిన హింస.. నలుగురు మృతి.. 250 మందికి గాయాలు

Highlights

Uttarakhand: టియర్ గ్యాస్ ప్రయోగించినా వెనక్కి తగ్గని అల్లరిమూకలు

Uttarakhand: ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పట్టణంలోని వన్‌భుల్‌పురా ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన ఒక మదర్సా, ఓ మసీదును స్థానిక మున్సిపల్ అధికారులు పోలీసు భద్రత నడుమ గురువారం కూల్చేయడంతో చోటు చేసుకున్న హింసాకాండలో నలుగురు చనిపోయారు. ఓ వర్గానికి చెందిన పలువురు జరిపిన రాళ్ల దాడిలో 250 మందికిపైగా గాయపడ్డారు. గాయపడిన వారిలో పోలీసులే ఎక్కువ మంది ఉన్నారు. రాళ్ల దాడి సమయంలో అక్కడున్న మున్సిపల్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది, జర్నలిస్టులకు కూడా గాయాలయ్యాయి. ప్రస్తుతం వారందరికీ స్థానిక ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.

అయితే పోలీసులు టియర్ గ్యాస్‌ ప్రయోగించినా అల్లరి మూకలు వెనక్కి తగ్గలేదు. సమీపంలోని పోలీస్ స్టేషన్ ఎదుట పార్క్ చేసిన దాదాపు 20కి పైగా వాహనాలకు నిప్పు పెట్టారు. దగ్ధమైన వాటిలో టూ వీలర్స్, బైక్స్, పోలీసుల బస్సులు, జీపులు ఉన్నాయి. ఈనేపథ్యంలో పట్టణంలో ఇంటర్నెట్ సేవలను బంద్ చేశారు. ఇవాళ స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ప్రస్తుతం హల్ద్వానీ పట్టణంలో కర్ఫ్యూ అమలవుతోంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర పారామిలటరీ బలగాలను రంగంలోకి దింపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories