Chardham Yatra 2022: చార్‌ ధామ్‌ యాత్రలో 203 మంది మృతి

201 Pilgrims Died in Less Than 60 Days in Char Dham Yatra
x

Chardham Yatra 2022: చార్‌ ధామ్‌ యాత్రలో 203 మంది మృతి 

Highlights

Chardham Yatra 2022: పవ్రితమైన నాలుగు క్షేత్రాలను దర్శించుకోవాలని చార్‌ ధామ్‌ వెళ్తున్న యాత్రికులు మృత్యువాత పడుతున్నారు.

Chardham Yatra 2022: పవ్రితమైన నాలుగు క్షేత్రాలను దర్శించుకోవాలని చార్‌ ధామ్‌ వెళ్తున్న యాత్రికులు మృత్యువాత పడుతున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 203 మంది యాత్రికులు మృతి చెందారు. కేదార్‌నాథ్‌ మార్గంలో 97 మంది, బద్రీనాథ్‌ మార్గంలో 51 మంది, గంగోత్రి మార్గంలో 13 మంది, యమునోత్రి మార్గంలో 42 మంది మృతి చెందారు. మే 3న ప్రారంభమైన ఈ యాత్రలో రెండు నెలలు గడువకముందే 200 మంది మృతి చెందడం విషాదానికి గురి చేస్తోంది.

ప్రతికూల వాతావరణం, గుండెపోటు, ఇతర ఆరోగ్య సమస్యలతోనే ఎక్కుమంది చనిపోయినట్టు ఉత్తరాఖండ్‌ ఎమర్జెన్సీ ఆపరేషన్‌ సెంటర్‌ తెలిపింది. మే 3 నుంచి ఇప్పటివరకు 25 లక్షల మంది యాత్రికులు నాలుగు పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నారు. వాతావరణంలో మార్పులు, వర్షాల కారణంగా వారం రోజులుగా యాత్రికుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. యాత్రికులు తప్పనిసరిగా చార్‌థామ్‌ యాత్రకు ముందే ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం కోరుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories