Annapurna Devi Idol: కాశీ అన్నపూర్ణ విగ్రహం వెనక్కి రప్పించిన ప్రభుత్వం

100 Years old Annapurna devi Idol Returns From Canada to Uttar Pradesh
x

అన్నపూర్ణ దేవి విగ్రహాం కనడ నుండి తిరిగి ఉత్తరప్రదేశ్ కు చేరుకుంది (ఫైల్ ఇమేజ్)

Highlights

Annapurna Devi Idol: అధికారికంగా విగ్రహాన్ని అందచేసిన కెనడా ప్రభుత్వం *ఈనెల 15న విగ్రహాన్ని కాశీలో ప్రతిష్టించనున్న యోగీ

Annapurna Devi Idol: విదేశీయులు ఎత్తుకెళ్లిన కాశీ అన్నపూర్ణ దేవి విగ్రహం ఎట్టకేలకు భారత్ కు రప్పించారు.. ఇటీవలే కెనడా నుంచి భారత్ తీసుకొచ్చిన ఈ విగ్రహాన్ని యూపీ ప్రభుత్వానికి అధికారికంగా అందచేశారు. నాలుగు రోజుల పాటు శోభాయాత్ర నిర్వహించి ఈనెల 15న కాశీలో విగ్రహ ప్రతిష్ట చేయనున్నారు. వారణాసి కాశీ విశ్వనాధ ఆలయంలో ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.

వందేళ్ల క్రితం నాటి ఈ అపురూప పురాతన విగ్రహాన్ని కెనడానుంచి వెనక్కి తెప్పిస్తున్నామని గత ఏడాది నవంబర్ మన్ కీ బాత్ లో ప్రధాని చెప్పారు. కెనడాలోని మెకంజీ ఆర్ట్ గ్యాలరీలో ఈ విగ్రహం ఉంది కాశీ అన్నపూర్ణా దేవి సాక్షాత్తూ పరమశివుడికే భిక్ష వేసినట్లు హిందువులు నమ్ముతారు.. అన్నపూర్ణ విగ్రహం కొలివైన చోట ఆకలి బాధలు ఉండవని అంటారు.

Show Full Article
Print Article
Next Story
More Stories