బీహార్ బరిలో..ఓటు వేసిన ప్రముఖులు! భారీగా వచ్చి ఓటేయండి..ప్రధాని మోడీ పిలుపు

బీహార్ బరిలో..ఓటు వేసిన ప్రముఖులు! భారీగా వచ్చి ఓటేయండి..ప్రధాని మోడీ పిలుపు
x
Highlights

Bihar Polling 2020: బీహార్ అసెంబ్లీ ఎన్నికల రెండోవిడత పోలింగ్ ముమ్మరంగా సాగుతోంది.

బీహార్ అసెంబ్లీ ఎన్నికల రెండోవిడత పోలింగ్ ముమ్మరంగా సాగుతోంది. రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకోవడమే కాకుండా అందరూ ఓటు వేయాలని కోరుతూ ప్రకటనలు చేస్తున్నారు. మరో వైపు ప్రధాని నరేంద్ర మోడీ ఇటు బీహార్ లోనూ.. అటు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికలలో పెద్ద సంఖ్యలో ఓటు వేయాలని ప్రజలను కోరారు.

భారీగా తరలిరండి: మోదీ

''ఈరోజు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉపఎన్నికలు జరుగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో ఓటర్లు భారీ ఎత్తున తరలివచ్చి ఓటింగ్‌లో పాల్గొనాలని కోరుతున్నాను. తద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత పటిష్ఠం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను''. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు ప్రధాని మోదీ బిహార్‌లో రెండు భారీ బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.

మాస్క్‌ ధరించి వెళ్లండి: సుశీల్‌ మోదీ

''ఓటేయడం కోసం ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలి. పోలింగ్‌ కేంద్రానికి మాస్క్‌ ధరించి వెళ్లండి. భౌతిక దూరం పాటించండి'' అని బిహార్‌ డిప్యూటీ సీఎం సుశీల్‌ కుమార్‌ మోదీ పిలుపునిచ్చారు. పట్నాలోని రాజేంద్ర నగర్‌ ప్రాంతంలో ఉన్న సెయింట్‌ జోసెఫ్‌ హై స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌ నెం.49లో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

మార్పు కోసం ఓటేయండి: తేజస్వీ యాదవ్‌

''సునామీ లాంటి ఈ మార్పులో ప్రజలు విద్య, వైద్యం, ఆర్థిక వ్యవస్థ, పరిశుభ్రత అజెండాపైనే ఓటేస్తారు. మార్పు కోరుకుంటున్న బిహార్‌ ప్రజలు కచ్చితంగా మా పార్టీ(ఆర్జేడీ)కే ఓటు వేస్తారు. ప్రజలు వారి సమస్యల పట్ల వేగంగా స్పందించే ప్రగతిశీల ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. మార్పు కోసమే ప్రజలు ఓటేస్తున్నారని తొలి విడత పోలింగ్‌ సరళితోనే అర్థమైపోయింది'' - తేజస్వీ యాదవ్‌, ఆర్జేడీ

ఓటు హక్కు వినియోగించుకున్న చిరాగ్‌

బిహార్‌లో ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాస్వాన్‌ ఖగరియాలోని ఓ పోలింగ్‌ బూత్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఓటు హక్కు వినియోగించుకున్న ఆర్‌ఆర్‌ నగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి

కర్ణాటకలోని ఆర్‌ఆర్‌ నగర్‌ అసెంబ్లీ స్థానానికి నేడు ఉపఎన్నిక జరుగుతోంది. ఇక్కడి నుంచి బరిలో ఉన్న కాంగ్రెస్‌ అభ్యర్థి హెచ్‌.కుసుమా కుటుంబ సభ్యులతో కలిసి జేఎస్‌పీయూ కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories