Virupaksha: నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పాయింట్ ని అందుకున్న "విరూపాక్ష"

Virupaksha Achieves Break-Even Point Within Four Days
x

Virupaksha: నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పాయింట్ ని అందుకున్న "విరూపాక్ష"

Highlights

Virupaksha: బ్లాక్ బస్టర్ దిశగా పరుగులు పెడుతున్న "విరూపాక్ష"

Virupaksha: చాలా కాలం తర్వాత సుప్రీం స్టార్ సాయి ధరమ్ తేజ్ తన కెరీర్ లోనే మర్చిపోలేని సూపర్ హిట్ ని అందుకున్నారు. కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన విరూపాక్ష సినిమా ఏప్రిల్ 21న విడుదలై థియేటర్లలో మంచి రెస్పాన్స్ ను అందుకుంటుంది. మొదటి రోజు నుంచి ఈ సినిమాకి బీభత్సమైన పాజిటివ్ టాక్ వచ్చేసింది. వర్డ్ ఆఫ్ మౌత్ అద్భుతంగా ఉండడంతో కలెక్షన్లలో కూడా అంతే జోరు కనిపించింది. ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక ఓవర్సీస్ లో కూడా సినిమా కలెక్షన్లు బాగానే ఉన్నాయి. వారాంతం తర్వాత సోమవారం నాడు కూడా అమెరికాలో సినిమా 100 కే డాలర్లను వసూలు చేసింది. ఇక సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే 24 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్లు నమోదు చేసుకొని బ్రేక్ ఈవెన్ పాయింట్ ను దాటేసింది. ఇప్పటికి కూడా కలెక్షన్లు బాగానే ఉండడంతో సినిమా బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్రపతాకం పై బి వి ఎస్ ఎన్ ప్రసాద్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

తెలుగులో మాత్రమే కాక రెస్పాన్స్ బాగుంటే సినిమాని హిందీ, తమిళ్, కన్నడ మరియు మలయాళం లో కూడా విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేసింది. ఇక సినిమా మంచి విజయాన్ని సాధించడంతో సినిమా హిందీ వర్షన్ ను మే 5 న విడుదల చేయబోతున్నారు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సునీల్, రాజీవ్ కనకాల, రవి కృష్ణ, అభినవ్ గోమాటం తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories