ఎన్టీఆర్ చేయగలరు కానీ చరణ్ చేయలేరు అంటున్న విజయేంద్రప్రసాద్

ఎన్టీఆర్ చేయగలరు కానీ చరణ్ చేయలేరు అంటున్న విజయేంద్రప్రసాద్
x

ఎన్టీఆర్ చేయగలరు కానీ చరణ్ చేయలేరు అంటున్న విజయేంద్రప్రసాద్

Highlights

Vijayendra Prasad: *ఎన్టీఆర్ చేయగలరు కానీ చరణ్ చేయలేరు అంటున్న విజయేంద్రప్రసాద్

Vijayendra Prasad: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు మొట్టమొదటిసారిగా కలిసి నటించిన సినిమా "ఆర్ ఆర్ ఆర్". ప్యాన్ ఇండియన్ సినిమాగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా భారీ అంచనాల మధ్యన విడుదల అయ్యింది. అంచనాలకు మించి ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద రికార్డులు వర్షం కురిపిస్తోంది. అయితే సినిమా చూసిన కొందరు రామ్ చరణ్ పాత్ర కి ఉన్న ఎలివేషన్లు ఎన్టీఆర్ పాత్ర కి ఇవ్వలేదని కామెంట్లు చేస్తుండగా మరి కొందరు రామరాజు పాత్ర లో ఎన్టీఆర్ ను తీసుకొని భీమ్ పాత్రలో రామ్ చరణ్ పెట్టి ఉంటే బాగుండేది అని అంటున్నారు.

తాజాగా దీని గురించి ఈ సినిమాకి కథను అందించిన విజయేంద్రప్రసాద్ రియాక్ట్ అయ్యారు. రామరాజు పాత్రలో ఎన్టీఆర్ అద్భుతంగా నటించే వాళ్ళు కానీ రామ్ చరణ్ మాత్రం భీం పాత్ర పూర్తిస్థాయిలో న్యాయం చేయలేక పోయేవారని, ఎందుకంటే ఆ పాత్ర కి కావాల్సిన మొరటు తనం చరణ్ లో లేదని అన్నారు. సినిమా మొదలు పెట్టే ముందు కూడా ఈ డిస్కషన్లు జరిగాయని భీం లాంటి అమాయకమైన మరియు వైల్డ్ పాత్రలో ఎన్టీఆర్ నటన బాగుంటుందని అలానే కళ్ళతోనే ఎక్స్ప్రెషన్ లు పలికించగల రామ్ చరణ్ రామరాజు పాత్రకి బాగా సెట్ అవుతారని ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories