Vijay Devarakonda: భారీ ఫ్రీ రిలీజ్ బిజినెస్ తో షాక్ ఇస్తున్న "లైగర్"

Vijay Devarakonda Liger Pre Release Business Report
x

Vijay Devarakonda: భారీ ఫ్రీ రిలీజ్ బిజినెస్ తో షాక్ ఇస్తున్న "లైగర్"

Highlights

Liger Pre Release Business:యువ హీరో విజయ్ దేవరకొండ తాజాగా ఇప్పుడు "లైగర్" అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు.

Liger Pre Release Business: యువ హీరో విజయ్ దేవరకొండ తాజాగా ఇప్పుడు "లైగర్" అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటిస్తుంది. విజయ్ దేవరకొండ కరియర్లో మొట్టమొదటి ప్యాన్ ఇండియన్ సినిమా గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

బాలీవుడ్ లో ఈ సినిమాకి కరణ్ జోహార్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ హాట్ కేకుల లాగా అమ్ముడు అయిపోయాయని వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం ఓటీటీ సాటిలైట్ రైట్స్ లను 98 కోట్లకు హాట్ స్టార్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాకి 160 కోట్ల వరకు బడ్జెట్ ఖర్చయింది. నిజానికి ఈ లాక్ డౌన్ ఎఫెక్ట్ లేకపోయినట్లయితే 130 కోట్లతోనే సినిమా పూర్తయిపోయేది. పెరిగిన వడ్డీలు, షెడ్యూల్ మార్పులు, ఆర్టిస్టుల డేట్ ల వల్ల బడ్జెట్ కొంచెం పెరిగింది. అయినా సరే నిర్మాతలకి ఏమాత్రం ఇబ్బంది కలగడం లేదు. దానికి కారణం సినిమా చేస్తున్న అద్భుతమైన ప్రీ రిలీజ్ బిజినెస్.

కేవలం నాన్ ధియేటర్ బిజినెస్ నుంచి 98 కోట్లు తీసుకొచ్చిన ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ తో ఇంకా ఎక్కువే తీసుకువస్తుందని చెప్పుకోవచ్చు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కూడా విడుదల అయ్యి మంచి రెస్పాన్స్ ను అందుకుంటోంది. "ఇస్మార్ట్ శంకర్" సినిమాతోనే లాభాలు గడించిన పూరి ఈ సినిమాతో కూడా మంచి హిట్ అందుకుంటారని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories