Narappa Movie: పంచెక‌ట్టులో నారప్ప' మూవీ పోస్టర్'

Narappa Movie: పంచెక‌ట్టులో  నారప్ప మూవీ పోస్టర్
x
Highlights

Narappa Movie: విక్టరీ వెంకటేష్ హీరోగా వస్తోన్ననారప్ప సినిమా నుండి ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పోస్టర్ ను రిలీజ్

Narappa Movie: విక్టరీ వెంకటేష్ హీరోగా వస్తోన్ననారప్ప సినిమా నుండి ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మరో పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఈ పోస్టర్ వెంకటేష్ పంచెకట్టుతో అచ్చమైన పల్లెటూరి వ్యక్తిగా కనిపిస్తున్నాడు. కుటుంబ సమేతంగా ఎదో శుభకార్యానికి వెళుతున్నట్టుగా పోస్టర్ ను డిజైన్ చేశారు. ఈ పోస్టర్ లో నటుడు రాజీవ్ కనకాల కూడా ఉన్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు వెంకీ. తమిళ్ లో సూపర్ హిట్ అయిన అసురన్ సినిమాను తెలుగు లో రీమేక్ చేస్తున్నారు వెంకటేష్. అసురన్ సినిమాలో ధనుష్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా అక్కడ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. అంతే కాదు ధనుష్ నటనకు అంతా ఫిదా అయిపోయారు. ఇప్పుడు ఇదే సినిమాను తెలుగులో నారప్పగా తీసుకురానున్నారు.

సురేష్ ప్రొడక్షన్ పై వెంకటేష్ సోదరుడు సురేష్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమా మే 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. నారప్ప సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వెంకటేష్ మహేష్ బాబు కలిసి నటించిన సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమాకు శ్రీకాంత్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియమణి నటిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథ కోసం వెంకీ పూర్తిగా తన లుక్ ను మార్చేశారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ లు, టీజర్ ఆకట్టుకున్నాయి.



Show Full Article
Print Article
Next Story
More Stories