Drushyam 2: ఓటీటీలో 'దృశ్యం- 2'?

Venkatesh Drushyam 2 Release Before Narappa
x

దృశ్యం-2 టీం (ఫొటో ట్విట్టర్)

Highlights

Drushyam 2: విక్టరీ వెంకటేశ్‌ చేతిలో పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. వేగంగా వీటిని పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యాడు.

Drushyam 2: విక్టరీ వెంకటేశ్‌ చేతిలో పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. వేగంగా వీటిని పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యాడు. ఇప్పటికే 'నారప్ప' సినిమా షూటింగ్ ను పూర్తి చేసిన వెంకీ మామా.. తాజాగా 'దృశ్యం 2' సినిమాను పూర్తి చేశాడు. ఈ రెండు సినిమాల విడుదల కరోనాతో వాయిదా పడిన సంగతి తెలిసిందే.

దృశ్యం 2ను ఓటీటీలో రిలీజ్‌ చేయాలని మొదట్లో భావించారంట. దీనికి నిర్మాత సురేశ్‌ బాబు ఒప్పుకోకపోవడంతో అప్పట్లో ఈ ఆలోచనను పక్కన పెట్టేశారు. అయితే తాజాగా సినిమాలు విడుదలయ్యే అవకాశం లేదు. ఇప్పట్లో సాధ్యంకాకపోవచ్చు. అందుకే దృశ్యం 2 సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు రెడీ అయినట్లు సమాచారం. మళయాళంలోనూ రెండో పార్ట్‌ను ఓటీటీలోనే విడుదల చేశారు.

కాగా, ఓటీటీ లో 'దృశ్యం 2' సినిమాను రిలీజ్ చేసి, పరిస్థితి ఓ కొలిక్కి వచ్చి థియేటర్లు తెరుచుకున్న తరువాత 'నారప్ప'ను విడుదల చేస్తే బాగుంటుందని హీరో వెంకటేష్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ వార్తలు నిజమైతే.. త్వరలోనే దృశ్యం 2 సినిమా ఓటీటీలో విడుదల కానుంది. మాతృకను డైరెక్ట్‌ చేసిన జీతూ జోసెఫే తెలుగు 'దృశ్యం 2'ని కూడా తెరకెక్కించాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories