Upasana: ఉపాసనకు పుట్టేది అమ్మాయే..కారణాలు ఇవే..?

Upasana Deliver Baby Girl or Boy?
x

Upasana: ఉపాసనకు పుట్టేది అమ్మాయే..కారణాలు ఇవే..?

Highlights

Upasana: ఉపాసనకు పుట్టేది అమ్మాయే..కారణాలు ఇవే..?

Upasana: మెగా ఫ్యామిలీ నటవారసత్వాన్ని నిలుపుతూ రామ్ చరణ్ కు వారసుడు పుడతాడని మెగా అభిమానులు సంబరపడుతున్న వేళ ఒక షాకింగ్ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. ఉపాసనకు పుట్టేది అమ్మాయేనంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనికి ఆధారాలు కూడా చూపించడం విశేషం. రాంచరణ్ తో వివాహం అయిన 10 ఏళ్ల తర్వాత ఉపాసన గర్భం దాల్చారు. 2022 డిసెంబర్ నెలలో ఉపాసన గర్భవతి అనే విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి అనౌన్స్ చేశారు. ఇక అప్పటి నుంచి వారసుడు వచ్చేస్తున్నాడంటూ మెగా అభిమానులు తెగ సంబరం చేసుకుంటున్నారు. అయితే రాంచరణ్, ఉపాసన చేస్తున్న కామెంట్స్ ఇందుకు భిన్నంగా ఉన్నాయి.

రాంచరణ్ మాటల సందర్భంలో బిడ్డను ఉద్దేశిస్తూ హర్ అని సంబోధించాడు. కాబట్టి రాంచరణ్ అభిప్రాయంలో ఉపాసన అమ్మాయికి జన్మనిస్తుందని వాదన మొదలైంది. అలాగే ఇటీవల జరిగిన ఉపాసన సీమంతం వేడుకల్లో పింక్ కలర్ హైలెట్ అయింది. అదే థీమ్ తో వేదికను సైతం డెకరేట్ చేశారు. అలాగే ఉపాసన కూడా పింక్ కలర్ డ్రస్ ధరించారు. పింక్ కలర్ గర్ల్ కి సింబల్ కాబట్టి..అమ్మాయే పుడుతుందని ప్రచారం జరుగుతోంది.

ఇక వారసత్వం చూసినా చరణ్ కు అమ్మాయే పుడుతుందని వాదిస్తున్నారు. చిరంజీవి కుటుంబంలో ఎక్కువగా అమ్మాయిలే పుట్టారు. చిరంజీవికి మొదటి సంతానం అమ్మాయి సుస్మిత. తర్వాత రాంచరణ్. మూడో సంతానం శ్రీజా. సుస్మితకు ఇద్దరు అమ్మాయిలే..అలాగే శ్రీజాకు కూడా ఇద్దరు ఆడపిల్లలే జన్మించారు. ఆ విధంగా చూస్తే రాంచరణ్ కు మొదటి సంతానంగా అమ్మాయి పుట్టే ఛాన్స్ ఉందంటున్నారు. మరి, ఈ ఊహాగానాలు తెరపడాలంటే ఉపాసన డెలివరీ వరకు వెయిట్ చేయాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories