ఏబీసీడీ వెనుక ఉన్న ఆ నలుగురు వీళ్లేనట

ఏబీసీడీ వెనుక ఉన్న ఆ నలుగురు వీళ్లేనట
x
Highlights

అల్లు శిరీష్ హీరోగా నటించిన 'ఏబీసీడీ' మలయాళం సినిమా రీమేక్ గా ఎట్టకేలకు నిన్న థియేటర్లలో కి వచ్చిన సంగతి తెలిసిందే. సంజీవ్ దర్శకత్వం వహించిన ఈ ...

అల్లు శిరీష్ హీరోగా నటించిన 'ఏబీసీడీ' మలయాళం సినిమా రీమేక్ గా ఎట్టకేలకు నిన్న థియేటర్లలో కి వచ్చిన సంగతి తెలిసిందే. సంజీవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని మధుర శ్రీధర్, యశ్ రంగినేని సంయుక్తంగా నిర్మించారు. అయితే ప్రేక్షకుల నుండి మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటున్న ఈ చిత్రంపై క్రిటిక్స్ మాత్రం నెగటివ్ గానే స్పందిస్తున్నారు. తాజాగా ఫిల్మ్ నగర్ లో ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర చర్చ సాగుతోంది. 'ఏబీసీడీ' చిత్రానికి ఇద్దరు దర్శకులు దర్శకత్వం వహించారట. అంతేకాక అల్లు శిరీష్ సినిమాలో కొన్ని సీన్లను మార్చమని డిమాండ్ చేశాడని, దానితో క్రియేటివ్ పార్ట్ లో ఇన్వాల్వ్ అయ్యాడు అని కొందరు చెవులు కోరుకుంటున్నారు.

అసలు అందుకే విడుదల కూడా ఆలస్యమైందని భోగట్టా. 'ఏబీసీడీ' అనుకున్న తేదీ కంటే రెండు నెలల ఆలస్యంగా రిలీజైంది. దానికి కారణం డైరెక్టర్లు సీన్లు మార్చి తీయడం అని తెలుస్తోంది. ఈ విషయమై మధుర శ్రీధర్ ని ఇలా అన్నారు. "ఏబీసీడీకి ఇద్దరు డైరెక్టర్లు అంటూ వచ్చిన వార్తలు రూమర్లు మాత్రమే. మలయాళ వెర్షన్ ని తెలుగులో మార్చేందుకు దాదాపు నలుగురి వద్ద సాయం తీసుకున్నాం. దర్శకులు బీవీఎస్ రవి, కృష్ణ చైతన్య, పవన్ సాధినేని, వాసు వర్మ లు సాయం చేశారు. కథ ఆత్మను తీసుకుని తెలుగువారికి తగ్గట్టు సన్నివేశాల్ని మలిచాం. దానికోసం కొన్ని మార్పు చేర్పులు చేయించాం." అని క్లారిటీ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories