యాంకర్ ప్రదీప్ పెళ్ళికొడుకు అవుతున్నాడు..

Anchor Pradeep Machiraju Marriage fixed
x

Anchor Pradeep Machiraju 

Highlights

బుల్లితెరపై బుల్లితెర మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రదీప్ మాచిరాజు పెళ్లి కుదిరింది. ఈ వార్త ప్రస్తుతం టీవీ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.

వెండితెరమీద మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ ప్రభాస్! మరి బుల్లితెర మీద? ప్రదీప్ మాచిరాజు. హే.. ఈ ఇద్దరికీ పోలికేంటి అనకండి. వెండి తెరమీద ప్రభాస్ ఫాలోయింగ్ ఎంతో బుల్లితెరమీద ప్రదీప్ యాంకరింగ్ కి అంత ఫాలోయింగ్ ఉంటుంది. అవును.. ప్రదీప్ యాంకరింగ్ కోసమే కొన్ని షో లు చూసే బుల్లితెర ప్రేక్షకులు ఉన్నారు. చక్కని ఆహార్యం.. సమయానికి తగ్గట్టుగా మాట్లాడటం.. షో జరుగుతున్నంత సేపూ ప్రేక్షకులను కట్టిపాదేసే వ్యాఖ్యానం.. హావభావాలు ఇలా ఏ రకంగా చూసుకున్నా తెలుగు బుల్లితెరపై ప్రదీప్ ది టాప్ ప్లెసే. ఈ మధ్యనే ఓ సినిమా కూడా హీరోగా చేశాడు ప్రదీప్. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? అంటూ చేసిన ఆ సినిమా కోవిడ్ కారణంగా విడుదల ఆలస్యం అయింది. అయితే, ఓటీటీలో ఈ సినిమా త్వరలో వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఈ సినిమా పాటలు రికార్డులు బద్దలు కొట్టాయి.

ఇక ప్రదీప్ ఏ వేదిక మీద కనిపించినా అతనికి ఎదురయ్యే మొదటి ప్రశ్న పెళ్లి ఎపుడు అనే. మనోడి మీద షో లలో తోటి యాంకర్లు.. న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్న వాళ్ళూ అందరూ ప్రదీప్ ని పెళ్లి పేరుతొ భయంకరంగా ఆడేసుకుంటారు. అసలు ప్రదీప్ పెళ్లి చేసేడ్డామనే పాపం పెళ్లిచూపులు అనే ప్రోగ్రాం కూడా చేసేసింది ఓ చానల్. అయితే, ఆ షో ప్లాప్ అయింది అది వేరే విషయం. కానీ, ప్రదీప్ పెళ్లి గురించి మాత్రం టీవీ ప్రేక్షకుల్లో.. సర్కిల్స్ లో చర్చ మాత్రం నడుస్తూనే ఉంటుంది. ఇక అప్పుడప్పుడు పాపం ప్రదీప్ ని టార్గెట్ చేసుకుని చాలా రూమర్స్ స్ప్రెడ్ అవుతుంటాయి. ఇక వీటన్నిటికీ పుల్ స్టాప్ పడే అవకాశం కనిపిస్తోంది.

ఇక పై షో లలో ప్రదీప్ పెళ్లి పై జోకులు వేసే అవకాశం ఎవరికీ ఉండదు. అవును.. త్వరలోనే ప్రదీప్ పెళ్ళికొడుకు కాబోతున్నాడట. ఇప్పటికే పెళ్లిచూపులు కార్యక్రమం అయిపోయిందట. ఇక పెళ్లి బాజాలు మోగడమే లేటు అని తెలుస్తోంది. అధికారికంగా ప్రదీప్ వెల్లడించకపోయినా.. బుల్లితెర వర్గాల్లో ప్రదీప్ పెళ్లి వార్త చక్కర్లు కొడుతోంది. త్వరలోనే ప్రదీప్ తన పెళ్లి శుభవార్త అందరికీ చెబుతాడని చెప్పుకుంటున్నారు. ఇప్పటివరకూ తెలిసిన సమాచారం ప్రకారం ప్రదీప్ చేసుకోబోయే అమ్మాయి సినిమా..టీవీ రంగాలకు సంబంధం లేని కుటుంబం నుంచి వస్తోందని తెలుస్తోంది. ఆమె రాజకీయాలలో టీడీపీ తరఫున యాక్టివ్ గా ఉన్న ఒక యువనేత అని తెలుస్తోంది. రాయలసీమకు చెందిన ఈ యువ రాజకీయవేత్త తో ప్రదీప్ మూడుముళ్ల బంధం పడబోతోంది అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా టీవీ సర్కిళ్లలో నలుగుతూన్న వార్త . మరి ప్రదీప్ చేసే అధికారిక ప్రకటన కోసం ఎదురు చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories