Tollywood: నెల రోజుల గ్యాప్‌లో మూడు ప్యాన్ ఇండియా మూవీస్

3 Pan India Movies Release Soon
x

పాన్ ఇండియా మూవీస్ 

Highlights

Tollywood: భారీ అంచనాలతో విడుదలై మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్న సాహో

Tollywood: ప్యాన్ ఇండియా.. బాహుబలితో పరిచయం అయిన ఈ పదం అనంతరం ఓ సెన్షేషన్ పదంగా మారిపోయింది. బాహుబలి బంపర్ హిట్‌తో దేశంలోని అన్ని సినీ పరిశ్రమలూ ఒక్కసారిగా ప్యాన్ ఇండియాపై ఫోకస్ చేసేశాయి. అయితే.. బాహుబలి రేంజ్ హిట్ కొట్టినవి మాత్రం వేళ్ల మీద కూడా లెక్కపెట్టలేం. ఒక్క కేజీఎఫ్‌ను మినహాయిస్తే ఆ రేంజ్ సక్సెస్ ఏ మూవీకి దక్కలేదు. మరిప్పుడు ఏకంగా మూడు సినిమాలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.. అసలే కరోనా కారణంగా సినిమాలు లేక కాలక్షేపం లేక అల్లాడుతున్న జనం.. ఒకేసారి మూడు మహా మూవీలు తెరపై దండ యాత్ర చేస్తే ఆ సందడి చూసేందుకు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. కరోనా కాక రేపుతున్నా.. జాగ్రత్తలు తీసుకుంటాం తప్ప.. థియేటర్లు మూసే ప్రసక్తి లేదని మంత్రి తలసాని చేసిన ప్రకటనతో అటు సినీ నిర్మాతలు, దర్శకులు ఖుషీ అవుతున్నారు. ఇక అభిమానుల జోష్ అయితే చెప్పనే అక్కర్లేదు.. మరి ఈసారి పాన్ ఇండియా హిట్ కొట్టే మూవీ ఏది? ఇదే పెద్ద సస్పెన్స్ గా మారింది.

టాలీవుడ్ డైరెక్టర్ జక్కన్న స్పూర్తితో చాలా మంది దర్శకులు ప్యాన్ ఇండియా ఫిల్మ్స్ మీద ఫోకస్ చేశారు. అయితే.. వారిలో కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ తప్ప దాదాపు అందరూ విఫలమయ్యారనే చెప్పాలి. ప్యాన్ ఇండియాగా రూపొందిన మెగాస్టార్ చిరంజీవి సైరా కూడా తెలుగు రాష్ట్రాల బయట ఆ రేంజ్ హిట్ కొట్టలేదనే చెప్పాలి. భారీ అంచనాలతో విడుదలైనప్పటికీ సైరాను బాలీవుడ్ ప్రేక్షకులు వెల్‌కమ్ చేయలేక పోయారు. అంతెందుకు భారీ అంచనాలతో రిలీజ్ అయిన ప్రభాస్ సాహో కేవలం మిక్స్ డ్ టాక్‌కు మాత్రమే పరిమితం అయింది. ఇలాంటి పరిస్థితుల్లో దక్షిణాది నుంచి మరో మూడు సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటే.. అందులో రెండు సినిమాలు ఏకంగా టాలీవుడ్ నుంచే పోటీ పడుతున్నాయి.

ఇప్పటికే దక్షిణాది నుంచి చాలా సినిమాలు ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో సందడి చేయడానికి సిద్ధమయ్యాయి. కోవిడ్‌ నేపథ్యంలో భారంగా గడిచిన సినీ పరిశ్రమ ఇప్పుడు థియేటర్లలో మోత మోగించడానికి దూసుకొస్తున్నాయి. బుల్లెట్ స్పీడుతో బాక్సాఫీసులను కొల్లగొట్టడానికి రెడీ అవుతున్నాయి. ప్రస్తుతం విడుదలకు సిద్ధమవుతున్న మూడు భారీ ప్యాన్‌ ఇండియా సినిమాలు ఒకే నెలలో సందడి చేయబోతుండటం విశేషం. కేజీయఫ్‌ ఛాప్టర్‌ 2, రాధేశ్యామ్‌, పుష్ప. ఇప్పుడు అభిమానులందరి దృష్టి ఈమూడు సినిమాల మీదే ఉంది.

కేజీఎఫ్.. ఇండియన్ మూవీ హిస్టరీలో ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. చాప్టర్-1లో హీరో ఇజానికి ఇచ్చిన ఎలివేషన్‌తో థియేటర్లు షేక్ అవ్వడమే కాదు.. బాక్సాఫీస్ బద్దలయ్యే హిట్ అయ్యింది. ప్రస్తుతం కన్నడ రాకింగ్ స్టార్ కేజీఎఫ్ చాప్టర్-2 విడుదలపైనా భారీ బజ్ వినిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఛాప్టర్-2 టీజర్ సోషల్ మీడియాలో సెన్షేషన్ క్రియేట్ చేసింది. జులై 16న విడుదల కానున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌ కోసం దేశంలోని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కేజీఎఫ్ ఛాప్టర్-2 విడుదలైన రెండు వారాల గ్యాప్‌లోనే మరో ప్యాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ విడుదలవుతోంది. ప్యాన్ ఇండియా మూవీస్‌కు పెట్టింది పేరైన ప్రభాస్ ఈ సినిమాలో లీడ్ రోల్ ప్లే చేయడం ఒకెత్తయితే.. తనదైన స్టైల్‌లో డైరెక్ట్ చేసే రాధాకృష్ణ రాధేశ్యామ్‌కు దర్శకుడు కావడం విశేషం. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో చేస్తోన్న సినిమా కావడంతో రాధేశ్యామ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాధేశ్యామ్ జులై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక ప్యాన్ ఇండియా రేస్‌లో మొదటి సారి నిలిచారు మెగా కాంపౌండ్ నుంచి ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్. స్టైలిష్‌స్టార్‌‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న పుష్ప బన్నీకి తొలి ప్యాన్‌ ఇండియా మూవీ. రంగస్థలంతో ఇప్పటికే బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సూపర్ డైరెక్టర్ సుకుమార్ పుష్పకు దర్శకుడు కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే ఫుల్ బజ్ వినిపిస్తోంది. దీనికోసం అల్లు అర్జున్ స్పెషల్ లుక్ గెటప్ కూడా ఇప్పటికే పాపులర్ అయింది. ఈ సినిమాలో ఓ ఆరు నిమిషాల నిడివి కలిగిన యాక్షన్ సీన్ కోసం ఏకంగా ఆరుకోట్లు ఖర్చు చేశారంటేనే సినిమా పై ఏ రేంజ్ శ్రద్ధ తీసుకున్నారో అర్ధమవుతుంది. అల్లూ అర్జున్ లుక్ ఏదో స్మగ్లింగ్, మాఫియా రిలేటెడ్ స్టోరీలాగే కనిపిస్తోంది. ఈ సినిమా ఆగష్ట్ 13న విడుదల కానుంది. దీంతో ఈ మూడు సినిమాలు ఏ రేంజ్ హిట్‌గా నిలుస్తాయి అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories