టాలీవుడ్ డ్రగ్స్ పై ఈడీ దర్యాప్తు ముమ్మరం

The Whole Investigation Into Tollywood Drugs
x

టాలీవుడ్ డ్రగ్స్ పై ఈడీ దర్యాప్తు ముమ్మరం

Highlights

Tollywood Drugs: 2017లో టాలీవుడ్‌ స్టార్స్‌తో పాటు.. 41 మంది కాల్ డేటా రికార్డింగ్స్ నమోదు.

Tollywood Drugs: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మరింత లోతుగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. పూర్తి వివరాలు, ఆధారాల కోసం ఈడీ ఇప్పటికే ఎక్సైజ్ శాఖకు లేఖ రాసింది. 2017లో టాలీవుడ్ స్టార్స్‌తో పాటు మొత్తం 41 మంది కాల్ డేటా రికార్డింగ్స్‌ను ఎక్సైజ్ శాఖ నమోదు చేసింది. వీరిపై 2017లో 12 ఎఫ్ఐఆర్లను ఎక్సైజ్ శాఖ నమోదు చేసింది. డ్రగ్స్ నిందితులతో పాటు సాక్షుల నుంచి కాల్ డేటా రికార్డింగ్స్ తీసుకున్నామని ఎక్సైజ్ సూపరిండెంట్ శ్రీనివాస్ ఈడీకి తెలిపారు. విచారణ సందర్భంగా అందరి కాల్ డేటా రికార్డింగ్స్‌ను ఎక్సైజ్ శాఖ సేకరించింది. నిందితుడు కెల్విన్ మొబైల్ ఫోన్‌ను సైతం ఎక్సైస్ శాఖ సీజ్ చేసింది. డ్రగ్స్ ఫెడ్లర్ కెల్విన్‌తో స్టార్స్‌కు ఉన్న సంబంధాల ఆధారాల కోసం స్టార్స్ కాల్ డేటా రికార్డింగ్స్‌ను సైతం ఎక్సైజ్ శాఖ తీసుకుంది.

అయితే ఈ డేటా ఇప్పటి వరకూ ఈడీకి అందలేదు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్‌లతో పాటు, ఎక్సైజ్ శాఖ సీజ్ చేసిన ఒరిజినల్ మెటీరియల్‌ను ఇవ్వాలని ఈడీ కోరింది. ట్రైల్ కోర్టులో ఉన్నాయని ఎక్సైజ్ శాఖ తెలిపింది. అయితే కోర్టుకు ఎక్సైజ్ శాఖ సమర్పించిన వాంగ్మూలాల కాపీలు మాత్రమే తమకు అందాయని.. అందులో కాల్ రికార్డింగ్స్ లేవని ఈడీ చెబుతోంది. ఈ వ్యవహారాన్ని తిరిగి కోర్టు దృష్టికి తీసుకొచ్చే యోచనలో ఈడీ ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories