Thalaivi: 'తలైవి' ట్రైలర్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

Talaivi Trailer‌ Release Date Fix
x

'తలైవి:(ఫొటోస్ ది హన్స్ ఇండియా)

Highlights

Thalaivi: మార్చి 23న కంగనా రనౌత్‌ పుట్టినరోజు సందర్భంగా 'తలైవి' ట్రైలర్‌ను విడుదల చేస్తున్నారు.

Thalaivi: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగ‌త న‌టి జయలలిత బయోపిక్‌ 'తలైవి'. ఫిబ్రవరి 24వ తేదీ జయలలిత జ‌యంతి సందర్భంగా ఈ చిత్రానికి ఏఎల్ విజయ్ ప్రారంభించారు. బాలీవుడ్ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ టైటిల్‌ పాత్రలో నటించారు. చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను జరుపుకుంటోంది. మార్చి 23న కంగనా రనౌత్‌ పుట్టినరోజు సందర్భంగా 'తలైవి' ట్రైలర్‌ను విడుదల చేస్తున్నారు. అది కూడా రెండు ప్రధాన నగరాలైన చెన్నై, ముంబైలలో 'తలైవి' ట్రైలర్‌ను రిలీజ్‌ చేయడానికి ఏర్పాటు జరుగుతున్నాయి. కంగనా రనౌత్‌, అరవింద స్వామి, నిర్మాతలు విష్ణు ఇందూరి, శైలేష్‌ ఆర్‌.సింగ్‌ ట్రైలర్‌ రిలీజ్‌ కార్యక్రమంలో పాల్గొంటారు. ఎ.ఎల్‌.విజయ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ఎంజీఆర్‌ పాత్రలో అరవింద స్వామి నటించారు. జీవీ ప్రకాశ్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్‌ కరుణానిధి పాత్రలో నటించగా.. జయలలిత నిచ్చెలి శశికళ పాత్రలో పూర్ణ నటించింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 23న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.

చ‌నిపోయి రెండేళ్లు దాటేసినా...

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత చ‌నిపోయి రెండేళ్లు దాటేసినా ఇప్ప‌టికీ ఆమె స్మ‌ర‌ణంలోనే ఉన్నారు అభిమానులు. అమ్మ అంటూ ఇప్ప‌టికీ ఆమెనే త‌లుచుకుంటున్నారు. ఈ సినిమాకు రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ క‌థ అందిస్తున్నాడు. ఈ సినిమా కోసం తొమ్మిది నెల‌లు స్క్రిప్ట్ సిద్ధం చేసాడు విజ‌య్. ఈ సినిమాలో జయలలిత జీవితంలో జరిగిన కొన్ని తెలియని ఆసక్తికరమైన విషయాల గురించి చూపించబోతున్నాడు విజయ్. ఈ పేరు మీకు తెలుసు.. కానీ ఈమె గురించి మీకు తెలియదు అంటూ టీజర్‌లో చూపించాడు దర్శకుడు విజయ్.

నో అబ్జ‌క్ష‌న్ స‌ర్టిఫికెట్...

జ‌య‌ల‌లిత బ‌యోపిక్ చేయ‌డానికి ఇప్పుడు ఫ్యామిలీ మెంబ‌ర్స్ నుంచి కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు. సినిమాలో ఎలాంటి వివాదాల లేకుండా నో అబ్జ‌క్ష‌న్ స‌ర్టిఫికెట్ కూడా తీసుకున్నారు. ఈ సినిమాకు విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ క‌థ అందిస్తుండ‌టంతో అంచ‌నాలు కూడా భారీగా ఉన్నాయి. దీనికి జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తుండ‌గా.. నిరవ్ షా సినిమాటోగ్రాఫర్‌గా ప‌ని చేస్తున్నాడు. ఎన్టీఆర్ బ‌యోపిక్ దారుణంగా ముంచేసినా కూడా ఇప్పుడు మ‌రోసారి బ‌యోపిక్ నిర్మిస్తున్నాడు విష్ణు ఇందూరి. మ‌రి జ‌య‌ల‌లిత బ‌యోపిక్ ఎలాంటి అద్భుతాన్ని చేస్తుందో వేచి చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories