'నువ్వే కావాలి'కి 20 ఏళ్ళు!

నువ్వే కావాలికి 20 ఏళ్ళు!
x
Nuvve kavali 
Highlights

20 Years For Nuvve kavali : చాలా సినిమాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకుల మదిలో అలా నిలిచిపోతాయి . టీవీలో ఎప్పుడైనా అ సినిమా తాలుకు పాట వచ్చినా, ఓ సన్నివేశం వచ్చినా అలాగే అతుక్కుపోయి మరి చూస్తారు ప్రేక్షకులు

20 Years For Nuvve kavali : చాలా సినిమాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకుల మదిలో అలా నిలిచిపోతాయి . టీవీలో ఎప్పుడైనా అ సినిమా తాలుకు పాట వచ్చినా, ఓ సన్నివేశం వచ్చినా అలాగే అతుక్కుపోయి మరి చూస్తారు ప్రేక్షకులు . అలాంటి సినిమాలలో తరుణ్ , రిచా కలిసి నటించిన " నువ్వే కావాలి" సినిమా కూడా ఒకటి .. ఈ సినిమా 2000 సంవత్సరంలో విడుదలై ఉహించిన దానికంటే ఎక్కువ విజయాన్నే అందుకుంది . నేటితో ఈ సినిమాకి 20 ఏళ్ళు నిండాయి.. ఈ సందర్భంగా సినిమాకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను హీరో తరుణ్, హీరోయిన్ రిచా, నటుడు సాయి కిరణ్ ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

బాలనటుడుగా నన్ను 'మనసు మమత' ద్వారా ఉషా కిరణ్‌ మూవీస్‌ సంస్థ నన్ను పరిచయం చేసింది. అలాగే హీరోగా కూడా అదే సంస్థ నన్ను పరిచయం చేయడం ఆనందంగా ఉంది. నా జీవితాంతం రామోజీరావు గారికి ధన్యవాదాలు. ఇది రీమేక్ సినిమా అయినప్పటికీ ఎక్కడ కూడా అలా అనిపించదు.. విజయ్ భాస్కర్, త్రివిక్రమ్ చాలా మార్పులు చేశారు. పంచ్ లు బాగా పేలాయి. ఇప్పటికి ఈ సినిమా పూర్తి అయి 20 ఏళ్ళు పూర్తి అయ్యిందంటే నమ్మలేకపోతున్నా.. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ అందరికి శుభాకాంక్షలు .. తరుణ్

ఈ సినిమాకి పనిచేసి 2 రోజులు అయినట్టుగా అనిపిస్తోంది. విజయ్‌ భాస్కర్‌ సర్‌.. నన్ను నమ్మి ఈ సినిమా తీసినందుకు చాలా థాంక్స్.. అలాగే రామోజీరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.. త్రివిక్రమ్‌ సర్‌ నా డైలాగ్స్‌ కోసం ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు. తరుణ్ ఓ ప్రకటనలో చేసిన మనం చేశాం.. ఆ తరువాత చరిత్ర గుర్తుపెట్టుకున్న నువ్వే కావలి అనే సినిమాని చేశాం.. అందరికి ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు.. : రిచా

ఈ సినిమాతో నాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ సినిమా విడుదలై 20 ఏళ్ళు అవుతుంది అంటే నమ్మడం కష్టంగా ఉంది. ఈ సినిమాకి ముందు శివలీలలు అనే ఓ సీరియల్ చేశాను.. ఆ తర్వాత ఎం చేయాలో తెలియని తికమకలో ఉన్న సమయంలో నువ్వే కావాలి సినిమా వచ్చింది. ఈ సినిమా నా జీవితాన్నే మార్చేసింది. నువ్వే కావాలితో ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. షూటింగ్ సమయంలో దర్శకుడు విజయ్ భాస్కర్ గారు ఇచ్చిన దైర్యం ఎప్పటికి మర్చిపోలేను.. విజయ్‌ భాస్కర్‌ గారికి, రవి కిశోర్‌ గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. : నటుడు సాయి కిరణ్

Show Full Article
Print Article
Next Story
More Stories