Taapsee: వద్దని వెళ్ళింది.. మళ్ళీ వచ్చింది

Tapsee Reentry in Telugu Films After Long Time
x

తాప్సీ 

Highlights

Taapsee: ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా నటించిన "ఝుమ్మంది నాదం" చిత్రంతో వెండితెరకి పరిచయం..

Taapsee: ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా నటించిన "ఝుమ్మంది నాదం" చిత్రంతో వెండితెరకి పరిచయం అయిన తాప్సీ చాలా కాలం తర్వాత తిరిగి తెలుగు సినిమాలో హీరోయిన్ గా కనిపించబోతుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ చిత్ర దర్శకుడు స్వరూప్ దర్శకత్వంలో రాబోతున్న ఒక లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో ముఖ్య పాత్రలో తాప్సీ కనిపించబోతుంది. కొంత కాలం క్రితం తెలుగు సినిమా పరిశ్రమపై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఈ భామ తాజాగా తిరిగి తెలుగు సినిమాలో నటించడంపై కొందరు సినిమా ప్రముఖులు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది. గతంలో పెద్ద హీరోలతోనే సినిమాలు చేయడానికి టాలీవుడ్ సినిమా నిర్మాతలు ఇష్టపడుతారని ఆ విషయంలో హీరోలు కూడా తమకి నచ్చిన హీరోయిన్స్ ని ఎంపిక చేసుకోవడంతో తనలాంటి టాలెంటెడ్ హీరోయిన్స్ కి అవకాశాలు లేకుండా పోయాయని వాపోయింది.

అలాగే తెలుగు సినిమా దర్శకులు నడుము, నాభి చూపించడానికే ఇష్టపడుతారని తను మొదట్లో చేసిన కొన్ని పాత్రల వల్ల పూర్తిగా గ్లామర్ రోల్స్ సంబంధించిన అవకాశాలు వచ్చాయని, ఇక సౌత్ లో మార్కెట్ లేని హీరోకు కూడా భారీగా రెమ్యునరేషన్ ఇచ్చి హీరోయిన్స్ కి ఇచ్చే రెమ్యునరేషన్ లో మాత్రం కోతలు విధిస్తారని గతంలో తాప్సీ చేసిన ఈ వ్యాఖ్యలు టాలీవుడ్ లో కొంత అలజడి సృష్టించాయి. ఇక ఆ తర్వాత టాలీవుడ్ ని వద్దనుకొని బాలీవుడ్ కి వెళ్ళిన తాప్సీ తప్పాడ్, మిషన్ మంగళ్, బద్లా వంటి చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇటీవలే తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన "హాసిన దిల్ రుభా" చిత్రం ఓటిటి లో విడుదలైంది. మ్యాట్ని ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి "మిషన్ ఇంపాసిబుల్'' టైటిల్ ని ఫిక్స్ చేసి మంగళవారం షూటింగ్ ని మొదలుపెట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories