శిష్యులను చూసుకునే విషయంలో సుకుమార్ తర్వాతే ఎవరైనా..

Sukumar Takes Responsibility For The Career Of His Junior On His Own
x

తన శిష్యుల కరీర్ బాధ్యతను కూడా తన నెత్తి మీద వేసుకునే సుకుమార్

Highlights

* ఇండస్ట్రీలో మిగతా డైరెక్టర్లతో పోలిస్తే సుకుమార్ అందరి కంటే స్పెషల్ అని చెప్పుకోవాలి

Sukumar: ఇండస్ట్రీలో మిగతా డైరెక్టర్లతో పోలిస్తే సుకుమార్ అందరి కంటే స్పెషల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే సుకుమార్ దగ్గర పని చేసిన అసిస్టెంట్ డైరెక్టర్లు చాలామంది ఇప్పుడు ఇండస్ట్రీలో డైరెక్టర్లుగా సెటిల్ అయ్యారు. నిజానికి అసిస్టెంట్ డైరెక్టర్లను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం డైరెక్టర్లకు ఉండదు. కానీ సుకుమార్ మాత్రం స్వయంగా బాధ్యత తీసుకొని మరి తన అసిస్టెంట్లకు మరియు అసోసియేట్ల కు మంచి కరియర్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు.

మొదటగా సుకుమార్ తన శిష్యుడైన సూర్య ప్రతాప్ పలనాటి ను సుక్కు డైరెక్టర్గా మార్చారు. "కుమారి 21ఎఫ్" అనే సినిమా ప్రతాప్ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. నిఖిల్ మరియు అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా "18 పేజెస్" అనే సినిమాతో మళ్లీ సూర్య ప్రతాప్ ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ఈ సినిమా రేపు అనగా డిసెంబర్ 23న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సినిమాకి సుకుమార్ స్వయంగా కథ అందించటం మాత్రమే కాక నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రతాప్ ఖాళీగా ఏమీ లేడని తనతో పాటు రంగస్థలం, పుష్ప, మరియు పుష్ప 2 స్క్రిప్ట్లలో తనకు సహాయం చేస్తూనే ఉన్నాడని అన్నారు సుకుమార్. అంతేకాకుండా సూర్యప్రతాప్ మైత్రి మూవీ మేకర్స్ వారితో ఇప్పుడు ఒక పెద్ద సినిమాని సైన్ చేసినట్లు అనౌన్స్ చేశారు.

ఇక సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసి ఇప్పుడు డైరెక్టర్ గా మారిన మరొకరు బుచ్చిబాబు సన. "ఉప్పెన" సినిమాతో డైరెక్టర్ గా మారిన బుచ్చిబాబు మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నారు. తాజాగా ఇప్పుడు ఏకంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఏదేమైనా అసిస్టెంట్ డైరెక్టర్లను లేదా అసోసియేట్లను లలోని టాలెంట్ ను గుర్తించి వారికి సహాయం చేయడంలో సుకుమార్ తర్వాతే ఎవరైనా.

Show Full Article
Print Article
Next Story
More Stories