పెళ్లికి సిద్ధమవుతున్న బెల్లంకొండ హీరోయిన్...

Sonarika Bhadoria Shares Her Boyfriend Pics on His Birthday | Live News Today
x

పెళ్లికి సిద్ధమవుతున్న బెల్లంకొండ హీరోయిన్...

Highlights

Sonarika Bhadoria: హిందీలో "దేవోన్ కి దేవ్ మహాదేవ్" సీరియల్లో పార్వతీదేవి పాత్రలో కనిపించిన సోనారికా భడోరియా...

Sonarika Bhadoria: హిందీలో "దేవోన్ కి దేవ్ మహాదేవ్" సీరియల్లో పార్వతీదేవి పాత్రలో కనిపించిన సోనారికా భడోరియా పృథ్వీ వల్లభ: ఇతిహాస్ భీ రహస్య భీ, మరియు దాస్తాన్ ఏ మొహబ్బతే: సలీం అనార్కలి సీరియల్స్ లో కూడా నటించి తన కంటూ ఒక మంచి పేరు సంపాదించుకుంది. హిందీ సీరియల్స్ తో మాత్రమే కాక తెలుగులో కూడా "జాదూగాడు" అనే సినిమాతో హీరోయిన్గా పరిచయమైన సోనారిక "స్పీడున్నోడు" సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన హీరోయిన్ గా కనిపించింది.

ఆ తర్వాత "ఈడోరకం ఆడోరకం" సినిమా తో తెలుగులో మంచి హిట్ ను అందుకుంది ఈ భామ. తాజాగా సోనారిక తన వ్యక్తిగత జీవితం వల్ల వార్తల్లో నిలిచింది. గత కొంతకాలంగా సోనారిక వికాస్ భరత్ అనే ఒక వ్యక్తి తో రిలేషన్ షిప్ లో ఉంది. తాజాగా బుధవారం నాడు తన బాయ్ ఫ్రెండ్ పుట్టిన రోజు సందర్భంగా బీచ్ దగ్గర రొమాంటిక్ గా దిగిన పలు అందమైన ఫోటోలను షేర్ చేస్తూ "బంగారం లాంటి మనసున్న అబ్బాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు.

నువ్వు ఎప్పుడూ నా మనసుని, సోల్ ని, మైండ్ నీ బాగా కేర్ చేస్తావు. నా సేఫ్ ప్లేస్ నువ్వే నా అతిపెద్ద అడ్వెంచర్ కూడా నువ్వే. నువ్వు ఎప్పుడూ నన్ను ఒక సాఫ్ట్ మరియు మంచి మనిషిగా మారుస్తూ ఉంటావు. ఎప్పుడూ నాకు అండగా నిలుస్తూ నా పక్కనే ఉంటావు. నా కోసం నీ గుండెల్లో ఒక ఇల్లు కట్టుకున్నావు. హ్యాపీ బర్త్డే" అని తన కాబోయే భర్త గురించి చెప్పుకొచ్చింది సోనారికా భడోరియా.

Show Full Article
Print Article
Next Story
More Stories