ఒక్క పాట కోసం 9 కోట్ల దాకా ఖర్చు పెట్టిన శంకర్

ఒక్క పాట కోసం 9 కోట్ల దాకా ఖర్చు పెట్టిన శంకర్
x

ఒక్క పాట కోసం 9 కోట్ల దాకా ఖర్చు పెట్టిన శంకర్

Highlights

Director Shankar: రామ్ చరణ్ ఫైట్ సీన్ కోసం 10 కోట్లు ఖర్చు చేస్తున్న శంకర్.

Director Shankar: "అర్ఆర్ఆర్" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు స్టార్ డైరెక్టర్ శంకర్ తో చేతులు కలపనున్న సంగతి తెలిసిందే. శంకర్ రామ్ చరణ్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మొదటి ప్యాన్ ఇండియన్ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. అయితే ఈ సినిమాలో ఒక పాటని భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కేవలం ఈ ఒక్క పాట కోసమే దర్శక నిర్మాతలు 9.4 కోట్లు ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది.

అలానే ఈ సినిమాలోని ఒక ఫైట్ సీన్ కోసం కూడా దాదాపు పది కోట్ల దాకా ఖర్చు అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చూస్తూ ఉంటే శంకర్ ఈ సినిమాని చాలా గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నట్లు అర్థమవుతోంది. అరవింద స్వామి ఈ సినిమాలో మెయిన్ విలన్ గా కనిపించనున్నారు. ఈ సినిమాలో అరవిందస్వామి ఒక రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించనున్నారట. కానీ తన పాత్ర మాత్రం చాలా విభిన్నంగా ఉంటుందని టాక్ నడుస్తోంది. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. "వినయ విధేయ రామ" సినిమా తర్వాత కియారా రామ్ చరణ్ తో రొమాన్స్ చేయనున్న రెండవ సినిమా ఇది.

Show Full Article
Print Article
Next Story
More Stories