Shah Rukh Khan: అందరి దృష్టిని ఆకర్షిస్తున్న షారుక్ ఖాన్ "జవాన్" వీడియో

Shah Rukh Khan Jawan Video is Viral on Social Media
x

Shah Rukh Khan: అందరి దృష్టిని ఆకర్షిస్తున్న షారుక్ ఖాన్ "జవాన్" వీడియో

Highlights

Shah Rukh Khan: అందరి దృష్టిని ఆకర్షిస్తున్న షారుక్ ఖాన్ "జవాన్" వీడియో

Shah Rukh Khan: బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ మరియు ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "జవాన్". యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నారు. సన్యా మల్హోత్రా మరియు నయనతార లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో సునీల్ గ్రోవర్ కూడా ముఖ్య పాత్ర పోషించారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా జూన్ రెండవ తేదీన ఐదు భాషల్లో విడుదల కాబోతోంది.

షారుఖ్ ఖాన్ కరియర్ లోనే ఇది మొట్టమొదటి ప్యాన్ ఇండియన్ సినిమా. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన సన్నివేశం సోషల్ మీడియాలో లీక్ అయింది. ఈ వీడియోలో షారుక్ ఖాన్ తన యాక్షన్ లుక్కుతో నోట్లో సిగరెట్తో చేతిలో బెల్ట్ తో కొంతమందిని చితక్కొడుతూ కనిపిస్తాడు.

ఇక ఈ యాక్షన్ సన్నివేశం ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బాలీవుడ్ ప్రేక్షకులకి మాత్రమే కాక సౌత్ఆడియన్స్ కి కూడా ఈ లీక్డ్ సీన్ విపరీతంగా నచ్చేసింది. కమర్షియల్ సినిమాలు తీయటంలో అట్లీ దిట్ట. ఇక ఈ సినిమా తో కూడా అట్లీ అభిమానులకు కనులవిందు చేస్తాడని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ రెండు విభిన్న పాత్రలో కనిపించనున్నారు. ఈ మధ్యనే షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన "పటాన్" సినిమా కూడా మంచి హిట్ అవడంతో ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories