Shahrukh Khan New Movie: పగ తీర్చుకోబోతున్న బాలీవుడ్ స్టార్ హీరో

Shah Rukh Khan and Nayanthara Jawaan Movie Will be in Revenge Action Entertainer
x

Shahrukh Khan - Nayanthara: (File Photo)

Highlights

*రివెంజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా షారుఖ్ సినిమా

Shahrukh Khan New Movie: బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ "జీరో" సినిమాతో డిజాస్టర్ ను అందుకున్నారు. కొన్ని నెలల పాటు సినిమాలకి దూరంగా ఉన్న షారుక్ ఖాన్ ఇప్పుడు తమిళంలో స్టార్ దర్శకుడైన అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. భారీ బడ్జెట్తో నిర్మించబడుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సన్యా మల్హోత్రా, ప్రియమణి మరియు సునీల్ గ్రోవర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

షారుక్ ఈ సినిమాలో డబల్ రోల్ లో కనిపించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా కథ గురించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా ఒక పెద్ద రివెంజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకి రాబోతోందట. ఈ నేపథ్యంలో షారుక్ ఖాన్ పగ తీర్చుకోవడం కోసం ఎదురుచూస్తున్న నయనతార, ప్రియమణి, సన్యా మల్హోత్రా మరికొందరితో కలిసి ఒక రాబరీ చేస్తారట. ఆ రాబరీ చుట్టూనే సినిమా కథ తిరుగుతూ ఉంటుందని సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories