Satyadev - Nivetha Thomas: సత్యదేవ్ సరసన ఓ సినిమా చేయబోతున్న నివేదాథామస్

Satyadev will Act with Actress Nivetha Thomas in His New Movie
x

సత్యదేవ్ సరసన ఓ సినిమా చేయబోతున్న నివేదాథామస్(ఫైల్ ఫోటో)

Highlights

* సత్యదేవ్ తో నివేతా నటించడం ఇదే మొదటిసారి. * ఏ ప్లస్ ఎస్ మూవీస్ తో సంయుక్తంగా వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Satyadev - Nivetha Thomas: ఈ మధ్యనే "ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య", "తిమ్మరుసు", "గువ్వా గోరింక" వంటి సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు యువనటుడు సత్యదేవ్. ఇప్పటికే సత్యదేవ్ చేతిలో పలు ప్రాజెక్టులు ఉన్న సంగతి తెలిసిందే.

"గుర్తుందా సీతాకాలం", "గాడ్సే", "రామసేతు" వంటి సినిమాలతో బిజీగా ఉన్న సత్యదేవ్ తాజా సమాచారం ప్రకారం తన తదుపరి సినిమాలో నివేదాథామస్ తో రొమాన్స్ చేయనున్నారట. సత్యదేవ్ తో నివేతా నటించడం ఇదే మొదటిసారి. వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా కోసం అభిమానులు కూడా బాగానే ఎదురు చూస్తున్నారు.

అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాని మరెవరో కాదు మహేష్ బాబు జి ఎం బి ఎంటర్టైన్మెంట్ వారు నిర్మిస్తున్నారు. ఏ ప్లస్ ఎస్ మూవీస్ తో సంయుక్తంగా వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

ఇక ఈ మధ్యన ఈ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "వకీల్ సాబ్" సినిమాలో కీలక పాత్ర పోషించిన నివేదా "మీట్ క్యూట్", సినిమాలతో బిజీగా ఉంది. ఈ సినిమా షూటింగ్ లో త్వరలోనే పాల్గొన్న బోతోంది నివేత థామస్. ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories