మనం ఒకటే.. కానీ అవే మనల్ని దూరం చేశాయి.. సమంత ఇన్‌స్టా పోస్ట్‌ వైరల్‌..

మనం ఒకటే.. కానీ అవే మనల్ని దూరం చేశాయి.. సమంత ఇన్‌స్టా పోస్ట్‌ వైరల్‌..
x
Highlights

Samantha: సినిమా రిలేషన్స్ ఎంత త్వరగా వికసిస్తాయో అంతే త్వరగా వాడిపోతుంటాయి.

Samantha: సినిమా రిలేషన్స్ ఎంత త్వరగా వికసిస్తాయో అంతే త్వరగా వాడిపోతుంటాయి. ఎన్నో జంటల విషయంలో ఇది ప్రూవ్ అయింది. పెళ్లి కావచ్చు, లివింగ్ రిలేషన్ కావచ్చు, ప్రేమ లేదా ఫ్రెండ్ షిప్ అయినాఅవొచ్చు. అయితే కొన్ని జంటల విషయంలో ఇది వర్తించదు. నాగార్జున-అమల ఇందుకు నిండు ఉదాహరణ. సినిమా రంగంలో తారసపడి ఒకరినొకరు ఇష్టపడి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఇప్పటికీ కలిసే ఉంటున్నారు. అయితే నాగార్జున తనయుడు అక్కినేని నాగచైతన్య విషయంలో మాత్రం అలా జరగకపోవడం విచారకం.

అక్కినేని నాగచైతన్య సైతం ప్రేమించి పెళ్లాడాడు. ఏం మాయ చేశావే సినిమా షూటింగ్ లో హీరోయిన్ సమంతను చూసి మొదటిచూపులోనే ప్రేమించేశాడు. సమంత కూడా నాగచైతన్యను ఇష్టపడడంతో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. వీరిని చూసి టాలీవుడ్ లోనే లవ్లీ కపుల్ అని అందరూ తెగ మెచ్చుకున్నారు. అయితే ఎవరి దిష్టి తగిలిందో ఏమో..చైతు సామ్ వివాహ బంధం ముడునాళ్ల ముచ్చటగా మిగిలింది. నాలుగేళ్ల వివాహ బంధానికి గుడ్ బై కొట్టేస్తూ ఇద్దరు విడాకులు తీసుకున్నారు.

విడాకులనంతరం ఇద్దరు తమ తమ కెరీర్ లో బిజీగా మారారు. అయితే వీరు మళ్లీ కలిస్తే చూడాలని అక్కినేని అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా వీరిద్దరి మధ్య జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అక్కినేని అభిమానుల కోరిక నెరవేరేలా ఉంది. తన విడాకులపై ఇంతవరకు ఎక్కడా ఒక్క ముక్క మాట్లాడని నాగచైతన్య తొలిసారిగా తాము విడిపోవడం పై స్పందించాడు. తాము విడిపోయి రెండేళ్లు అవుతుందని..ఇద్దరం విడిపోయినా సమంతో కలిసి ఉన్న రోజులను చాలా గౌవరిస్తానని నాగచైతన్య చెప్పాడు. అంతేకాదు, సమంత చాలా మంచి అమ్మాయి, అన్ని ఆనందాలకు ఆమె అర్హురాలు అంటూ తన మాజీ భార్యను చైతు పొగిడేశాడు. తాము విడిపోవడానికి సోషల్ మీడియాలో వచ్చిన రూమర్లే కారణమంటూ నాగచైతన్య బాంబ్ పేల్చాడు.

జీవితంలో ప్రతీది ఒక గుణపాఠం లాంటిదన్న నాగచైతన్య తాము విడిపోయినా ఒకరిపై ఒకరికి గౌరవం ఉందని..కానీ మీడియా మాత్రం ఒకరిపై ఒకరికి గౌరవం లేనట్లు చిత్రీకరిస్తోందని బాధపడ్డాడు. మొత్తంగా సమంత చాలా లవ్లీ పర్సన్ అంటూ మాజీ భార్యను నాగచైతన్య ప్రశంసిస్తే..తన మాజీ భర్త చేసిన కామెంట్స్ పై సమంత సోషల్ మీడియాలో రియాక్ట్ అయింది.

మనమంతా ఒక్కటే..కేవలం అహంకారం, భయాలు మనల్ని దూరం చేస్తాయి అంటూ ఓ కొటేషన్ ను సమంత తన ఇన్ స్టా లో షేర్ చేసింది. చైతు కామెంట్స్ అనంతరం సామ్ ఇలా పోస్ట్ చేయడంతో వీళిద్దరు కేవలం ఈగోలతోనే విడిపోయి ఉంటారని నెటిజన్స్ అనుకుంటున్నారు. అంతేకాదు, వీరు మళ్లీ కలిసుంటే బాగుంటుంది కదా అని సోషల్ మీడియా ఫాలోవర్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి, వీరికి ఎలా రాసిపెట్టుందో కాలమే డిసైడ్ చేస్తుంది.



Show Full Article
Print Article
Next Story
More Stories