Samantha: సామ్-చై మళ్లీ కలవబోతున్నారా.. ప్యాచప్ వార్తలపై బాంబ్ పేల్చిన సమంత..!

Samantha: సామ్-చై మళ్లీ కలవబోతున్నారా.. ప్యాచప్ వార్తలపై బాంబ్ పేల్చిన సమంత..!
x
Highlights

సమంత పింక్ కలర్ చీరలో ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Samantha Ruth Prabhu Remove Tattoo: దక్షిణాది క్వీన్ సమంత రుతు ప్రభు తన చిత్రాల కంటే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ముఖ్యాంశాలలో నిలుస్తోంది. సమంత ప్రస్తుతం నటనకు విరామం తీసుకుంది. సమంత 2021 సంవత్సరంలో నాగ చైతన్య నుంచి విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించింది. విడాకుల తర్వాత, శామ్, చై ఇద్దరూ తమ జీవితంలో ముందుకు సాగుతున్నారు. ఈలోగా సమంత, నాగ చైతన్య ప్యాచ్‌అప్‌పై వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ రూమర్‌కి సమంత ముగింపు పలికింది. ఈక్రమంలోనే సమంత చై పేరుతో ఉన్న టాటూని తొలగించింది.

సమంత రుతు ప్రభు తన నడుం మీద చైతన్య ముద్దుపేరు చై అని టాటూ వేయించుకుంది. ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు ఈ టాటూ వేయించుకున్నారు. సమంత మరో రెండు టాటూలను చైతన్యకు అంకితం చేసింది. ఈ టాటూలు ఏప్రిల్ వరకు ఫొటోలలో కనిపించాయి. ప్రియాంక చోప్రా నటించిన సిటాడెల్ ప్రీమియర్ షో కోసం సమంత లండన్ వెళ్లింది. అయితే, ఇప్పుడు కొత్త ఫొటోల్లో టాటూ కనిపించడం లేదు. అంటే ఇద్దరూ కలిపిపోవడం తప్పని తేలింది.

అందమైన ఫొటోలను పంచుకున్న సమంత..

సమంత పింక్ కలర్ చీరలో ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ చిత్రాలలో ఆమె చాలా అందంగా కనిపిస్తోంది. ఈ ఫొటోల్లో సమంత నడుం కనిపిస్తుంది. దానిపై పచ్చబొట్టు కనిపించలేదు.

టాటూ వేయించుకోవడంపై పశ్చాత్తాపం..

గత ఏడాది సమంత ఒక సెషన్‌లో టాటూ వేయించుకున్నందుకు చింతిస్తున్నట్లు తెలిపింది. టాటూల గురించి సమంత మాట్లాడుతూ - నా చిన్న సలహా ఏమిటంటే టాటూలు వేయించుకోకూడదు. అలాంటి తప్పులు చేయవద్దు' అంటూ చెప్పుకొచ్చింది.

సమంత రుతు ప్రభు, నాగ చైతన్య 2017 సంవత్సరంలో గోవాలో వివాహం చేసుకున్నారు. హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం వివాహం జరిగింది. 2021లో ఇద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించారు.



Show Full Article
Print Article
Next Story
More Stories