సమంత అంచనాలను అందుకోగలదా

సమంత అంచనాలను అందుకోగలదా
x
Highlights

ఈ మధ్యనే 'మజిలీ' సినిమాతో హిట్ అందుకున్న స్టార్ బ్యూటీ సమంత అక్కినేని తాజాగా 'ఓ బేబీ' అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి...

ఈ మధ్యనే 'మజిలీ' సినిమాతో హిట్ అందుకున్న స్టార్ బ్యూటీ సమంత అక్కినేని తాజాగా 'ఓ బేబీ' అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సౌత్ కొరియన్ సూపర్ హిట్ సినిమా 'మిస్ గ్రాని' కి రీమేక్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంతకుముందు 'కొరియర్ బాయ్ కళ్యాణ్', 'బంగారు కోడిపెట్ట', 'సాహసం శ్వాసగా సాగిపో' వంటి చిత్రాలను నిర్మించిన సునీత తాటి ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తుండగా, సురేష్ ప్రొడక్షన్స్ వారు సమర్పిస్తున్నారు.

తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ పనులను మొదలు పెట్టారు దర్శక నిర్మాతలు. ఈ నేపథ్యంలో విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. అయినప్పటికీ చిత్రబృందం మాత్రం ఈ సినిమా ఫలితం గురించి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. సౌత్ కొరియన్ వెర్షన్ లో ఎమోషన్స్ మరియు కామెడీ కీలక అంశాలుగా ఉంటాయి మరి ఆ రెండు తెలుగు లో ఎంత వరకు ప్రేక్షకులను మెప్పిస్తాయి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే తెలుగు నేటివిటీకి తగ్గట్టు కథలో కొన్ని మార్పులు చేశారట. మరి సమంత ఈ సినిమాతో ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో వేచిచూడాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories