RRR Movie: ఎత్తర జెండా సాంగ్‌ వచ్చేసింది..

RRR Movie Etthara Jenda Video Song Released
x

RRR Movie: ఎత్తర జెండా సాంగ్‌ వచ్చేసింది.. 

Highlights

RRR Movie: ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా "ఆర్ఆర్ఆర్".

RRR Movie: ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా "ఆర్ఆర్ఆర్". బాహుబలి సినిమా తరువాత ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న సినిమా ఇది. ప్రీ ఇండిపెండెన్స్ బ్యాక్ డ్రాప్ తో సాగనున్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనుండగా ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించనున్నారు. ఎప్పుడో జనవరిలో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. తాజాగా ఈనెల 25వ తేదీన థియేటర్లలో భారీ రేంజ్ లో విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ చిత్రం నుంచి ఎత్తర జెండా అనే ఉత్తేజభరిత గీతాన్ని అభిమానుల కోసం ముందే తీసుకువస్తున్నామని ఇటీవల దర్శకుడు రాజమౌళి ప్రకటించారు. 'ఎత్తర జెండా' పాటను విడుదల చేశారు. కీరవాణి స్వరాలు సమకూర్చగా, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ఇక ఈ పాటకు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, అలియా కలిసి వేసిన స్టెప్‌లు ఓ ఊపు ఊపేస్తున్నాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories