Samantha: సమంత, చిట్టిబాబు మధ్య వివాదానికి ఇదే కారణం..?

Reasons Behind Samantha Chitti Babu Controversy
x

Samantha: సమంత, చిట్టిబాబు మధ్య వివాదానికి ఇదే కారణం..?

Highlights

Samantha: నిర్మాత, నటుడు చిట్టిబాబు, హీరోయిన్ సమంతల మధ్య మాటల యుద్ధం ముదిరి పాకానపడింది.

Samantha: నిర్మాత, నటుడు చిట్టిబాబు, హీరోయిన్ సమంతల మధ్య మాటల యుద్ధం ముదిరి పాకానపడింది. ఇద్దరు ఒకరిపై ఒకరు మాటల యుద్ధం సాగిస్తున్నారు. తాజాగా సమంతను ఉద్దేశిస్తూ చిట్టిబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన చెవిలో వెంట్రుకల గురించి మాట్లాడే బదులు...తన మాటల్లో నిజాయితీ గురించి మట్లాడితే బాగుండేది అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తాను నోరు విప్పితే సమంత పరువు పోవడం గ్యారెంటీ అన్నారు. అంతేకాదు తాను గట్టిగా మాట్లాడితే సమంత తల ఎక్కడ పెట్టుకుంటారని చిట్టిబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

హీరోయిన్ సమంత, నిర్మాత చిట్టిబాబు(Chitti Babu) మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అయితే ఈ వివాదానికి ముందు ఆజ్యం పోసింది మాత్రం చిట్టిబాబే. శాకుంతలం చిత్రం విడుదలకు ముందు సమంతను టార్గెట్ చేస్తూ చిట్టిబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శాకుంతలం సినిమా రిలీజ్ సమయంలో సమంతకు వయసు అయిపోయిందని..శకుంతల పాత్రకు సమంత సెట్ అవ్వలేదని, అంతేకాదు సినిమా ప్రమోషన్ కోసం ఆరోగ్యం బాగాలేదంటూ సమంత సెంటిమెంట్ డ్రామాలు ఆడుతోందని చిట్టిబాబు ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు.

చిట్టిబాబు వ్యాఖ్యలకు తగ్గట్టే మయోసైటిస్ తో బాధపడుతున్నానంటూ యశోద చిత్రం ప్రమోషన్స్ లో సమంత తన పర్సనల్ లైఫ్ గురించి తన ప్రాబ్లమ్స్ గురించి చెబుతూ కన్నీరు పెట్టుకుంది. శాకుంతలంలోని తన పాత్రకు డబ్బింగ్ చెప్పే సమయంలో కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. శాకుంతలం విడుదలకు రెండు రోజుల ముందు తనకు జ్వరం సోకినట్లు ట్వీట్ చేసింది. అయితే సిటాడెల్ ప్రమోషన్స్ కోసం లండన్ వెళ్లిన సమంత అల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపించి అందరి మైండ్ బ్లాక్ చేసింది. దీంతో సమంత అనారోగ్య కథలు అంతా ఒట్టిదేనంటూ చాలామంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు కూడా. నిర్మాత చిట్టిబాబు సైతం ఇదే అర్థం వచ్చేలా జబ్బు లేకపోయినా ఉన్నట్లుగా నాటకాలు చేస్తుందని...సింపతితో ప్రేక్షకులు థియేటర్లు వస్తారని అనుకుంటోందని విమర్శించారు.

చిట్టిబాబు చేసిన కామెంట్స్ పై సమంత తనదైన రీతిలో స్పందించింది. చెవిలో జుట్టు పెరగడం గురించి మాట్లాడుతూ పరోక్షంగా ఆయనకు చురకలు అంటించారు. జనాలకు చెవుల్లో నుంచి జుట్టు ఎందుకు బయటకు వస్తుందంటూ గూగుల్ లో సెర్చ్ చేసిన సామ్ టెస్టోస్టిరాన్ హార్మోన్ ఎక్కువగా ఉండడం వల్లే అలా వస్తుందని సమంత ఒక స్క్రీన్ షాట్ ను షేర్ చేసింది. ఈ పోస్టుకు ఇఫ్ యూ నో యూ నో అంటూ కామెంట్ పెట్టింది. సమంత చేసిన ఈ కామెంట్ పైనే చిట్టిబాబు శివాలెత్తిపోయారు. తాను గట్టిగా మాట్లాడితే సమంత తల ఎక్కడ పెట్టకుంటుందని ఘాటు కామెంట్స్ చేశారు. ఏదిఏమైనా, సమంత-చిట్టిబాబు ఇద్దరు ఒకరిపై ఒకరు కౌంటర్ల మీద కౌంటర్లు వేసుకుంటున్నారు. మరి వీరిమధ్య వివాదం ఎక్కడకు దారి తీస్తుందో ఎప్పుడు చల్లారుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories