Ravi Teja: ఫ్యామిలి మ్యాన్ గా రవితేజ

Ravi Teja Role in Chiranjeevi movie | Tollywood News
x

ఫ్యామిలి మ్యాన్ గా రవితేజ

Highlights

Ravi Teja: చిరంజీవి సినిమాలో రవితేజ పాత్ర ఇదేనా?

Ravi Teja: మెగాస్టార్ చిరంజీవి చేతిలో ఇప్పుడు బోలెడు బడా ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకవైపు "ఆచార్య" సినిమాతో బిజీగా ఉన్న చిరంజీవి మరోవైపు తన 154వ సినిమాతో కూడా బిజీగా ఉన్నారు. వెంకి మామ ఫేమ్ కే ఎస్ రవీంద్ర అలియాస్ బాబీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. మెగాస్టార్ కెరీర్ లోనే ఈ సినిమా ఒక క్రేజీ మాస్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే మాస్ మహారాజా రవితేజ ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత మెగాస్టార్తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు రవితేజ. కాబట్టి ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాలో రవితేజ మెగాస్టార్ తమ్ముడి పాత్రలో కనిపించబోతున్నారు అని కూడా టాక్ నడుస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం రవితేజ ఈ సినిమాలో మరి యంగ్ గా కాకుండా ఒక తండ్రి పాత్రలో కనిపించబోతున్నారు అని తెలుస్తోంది. ఏదేమైనా చాలా కాలం తర్వాత ఇలాంటి క్రేజీ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండడంతో అభిమానులు కూడా సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories