కమ్మ రాజ్యంలో కడప రెడ్లు!

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు!
x
Highlights

కొందరు వివాదాన్ని సృష్టిస్తారు.. ఇంకొందరు వివాదాన్ని పెద్దది చేసి పండగ చేసుకుంటారు.. మరికొందరు వివాదాన్ని తెగేదాకా సాగదీసి లబ్ధిని పొందే ప్రయత్నం...

కొందరు వివాదాన్ని సృష్టిస్తారు.. ఇంకొందరు వివాదాన్ని పెద్దది చేసి పండగ చేసుకుంటారు.. మరికొందరు వివాదాన్ని తెగేదాకా సాగదీసి లబ్ధిని పొందే ప్రయత్నం చేస్తారు. అయితే, ఈ మూడింటినీ చేయగల దిట్టలు దాదాపుగా కనబడరు. అటువంటి వివాదాస్పద దిట్ట రాంగోపాల్ వర్మ. ఒక మాఫియా నాయకుడిని హీరో లా చూపించాలన్నా.. ఒక స్మగ్లర్ కథలో సెంటిమెంట్ చొప్పించాలన్నా.. మామూలుగా ఉన్న కథలో రాజకీయాన్ని రాజేయాలన్నా రాంగోపాల్ వర్మ తర్వాతే ఎవరన్నా.. ఇటీవలి కాలంలో తెలుగుదేశం నాయకులకు.. కార్యకర్తలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన వర్మ ఇపుడు మరో వివాదాస్పద టైటిల్ తో తెరమీదకు వచ్చారు.

సామాజిక వర్గాల పేర్లను కలుపుతూ.. కమ్మ రాజ్యంలో.. కడప రెడ్లు అనే సినిమా తీయబోతున్నానని ప్రకటించారు. వర్మకి తెలుగుదేశం నాయకత్వంతో బహిరంగ శత్రుత్వమే వుంది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవాలని బహిరంగంగా కోరుకున్న వ్యక్తుల్లో మొదటి వరుసలో ఉండేవాడు వర్మే అంటే అతిశయోక్తి కాదు. ఇపుడు ఆయన కోరిక ఫలించింది. వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇక టీడీపీ బ్రేకులేసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల చేయడానికి సిద్ధం అవుతున్నాడు. ఆ వివరాలు చెప్పడానికి వచ్చిన వర్మ జస్ట్ ఇపుడే ఓ థాట్ వచ్చిందంటూ తన కొత్త సినిమా టైటిల్ ప్రకటించి సంచలనం సృష్టించాడు.

దీనికి ఆయన చెప్పిన కారణం కూడా వివాదాస్పదం అయ్యే రీతిలో ఉంది. గతంలో తానూ వచ్చినప్పటికీ..ఇప్పటికీ విజయవాడలో చాలా తేడా వచ్చిందనీ.. విజయవాడ రాగానే బోయపాటి సినిమాలో లా సుమోలు తిరుగుతున్నాయని, కడపలో చూసిన రెడ్లంతా ఇక్కడే ఉన్నారంటూ నవ్వులు కురిపించారు. ఆ నవ్వుల మధ్యే .. తనకు ఒక ఇన్సిపిరేషన్ వచ్చిందని, ఇక కథ రాయడం మొదలు పెడతానని వర్మ ఈ సినిమా టైటిల్ ప్రకటించారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏమిటంటే.. మొదట కమ్మరాజ్యంలో.. కడప రౌడీలు అని చెప్పి వెంటనే దానిని సరిచేసుకుని.. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు! అని ప్రకటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories