రామ్ సినిమా కోసం మార్కెట్ కి మించి బడ్జెట్ పెట్టిన నిర్మాతలు

Ram Pothineni is Making his First Big Budget Film | Telugu Movie News
x

రామ్ సినిమా కోసం మార్కెట్ కి మించి బడ్జెట్ పెట్టిన నిర్మాతలు

Highlights

*రామ్ సినిమా కోసం మార్కెట్ కి మించి బడ్జెట్ పెట్టిన నిర్మాతలు

Ram Pothineni: యువ హీరో రామ్ పోతినేని మార్కెట్ నిన్న మొన్నటి దాకా కేవలం 20 నుంచి 25 కోట్లు లోపు మాత్రమే ఉండేది. కానీ ఈ మధ్యనే పూరి జగన్నాథ్ డైరెక్షన్లో రామ్ హీరోగా వచ్చిన "ఇస్మార్ట్ శంకర్" విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఇస్మార్ట్ శంకర్ సినిమా తో రామ్ మార్కెట్ కూడా పెరిగిపోయింది. ఇప్పుడు రామ్ మార్కెట్ 50 కోట్లకు చేరింది. ఇకపై రామ్ సినిమాలకు 50 కోట్ల బడ్జెట్ పెట్టడానికి నిర్మాతలు ఆలోచించరు. కానీ రామ్ తన తదుపరి సినిమాతో తన బడ్జెట్ ని మరింత పెంచాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. కెరీర్ లో మొట్టమొదటి భారీ బడ్జెట్ సినిమాతో రామ్ బిజీగా ఉన్నాడు.

అదే "ది వారియర్". కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో రామ్ హీరోగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా ఇది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కోసం 70 కోట్ల బడ్జెట్ అయ్యింది. ఇంకా కొంత భాగం షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మిగిలి ఉన్నాయి. పబ్లిసిటీ కాస్ట్ కూడా కలుపుకుంటే మరో 5 కోట్లు ఖర్చు అయ్యే అవకాశం కనిపిస్తోంది. అంటే ఈ సినిమా కోసం దాదాపుగా 75 కోట్లు బడ్జెట్ అన్నమాట.

ఇదే రామ్ కెరీర్లోనే భారీ బడ్జెట్ సినిమా కానీ ఆ డబ్బులు తిరిగి వస్తాయా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. థియేట్రికల్ రైట్స్ రూపంలో రామ్ సినిమాకి మహా అయితే 35 కోట్లు రావడం కూడా ఎక్కువే. శాటిలైట్ మరియు డిజిటల్ రైట్స్ కి మరో 20 కోట్లు తీసుకున్నప్పటికీ, 55 కోట్లు మాత్రమే తిరిగి వచ్చినట్లు. అయితే ఈ సినిమాని తమిళంలో కూడా విడుదల చేస్తున్నారు. మరి అది రామ్ కి ఎంత వరకు ప్లస్ అవుతుందో వేచి చూడాలి. మరోవైపు బోయపాటి శ్రీను రామ్ కాంబినేషన్లో సినిమా కోసం బడ్జెట్ 100 కోట్లు అని వార్తలు వినిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories