RC15 Movie: సెట్స్ పైకి వెళ్లనున్న రామ్ చరణ్ - శంకర్ సినిమా

Ram Charan and Director Shankar RC15 Movie Shooting Date Confirmed
x

రామ్ చరణ్ శంకర్ సినిమా షూటింగ్ కి డేట్ ఫిక్స్ (ట్విట్టర్ ఫోటో)

Highlights

* రామ్ చరణ్ శంకర్ సినిమా షూటింగ్ కి డేట్ ఫిక్స్

RC15 Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం " ఆర్ ఆర్ ఆర్" మరియు "ఆచార్య" సినిమాలతో బిజీ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలు పూర్తయిన తర్వాత రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. శంకర్-రామ్ చరణ్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మొదటి సినిమా ఇది. దీనిపై అభిమానులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా స్టార్ డైరెక్టర్ శంకర్ కి ఇది మొట్టమొదటి డైరెక్ట్ తెలుగు సినిమా. ఈ సినిమాని కూడా ప్యాన్ ఇండియన్ రేంజ్లో ప్లాన్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు.

తాజా సమాచారం ప్రకారం శంకర్ ఈ సినిమా షూటింగ్ ని అతి తొందర్లోనే సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నారు. ఈ సినిమా కి సంబంధించిన మొట్టమొదటి షెడ్యూల్ అక్టోబర్ 22 నుంచి పూణేలో మొదలవనుంది. ఒక ఇరవై రోజుల పాటు సాగనున్న ఈ షెడ్యూల్ లో ఒక ఎపిసోడ్ షూటింగ్ ని పూర్తి చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ సరసన "వినయ విధేయ రామ" సినిమా లో హీరోయిన్ గా కనిపించిన కియారా అద్వానీ ఈ సినిమాలో కూడా రామ్ చరణ్ తో రొమాన్స్ చేయనుంది. పొలిటికల్ డ్రామా గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా లో రామ్ చరణ్ ఒక సివిల్ సర్వీసెస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories