Ray Stevenson: స్కాట్ దొర మరణంపై జక్కన్న ఎమోషనల్ ట్వీట్

Rajamouli Pays Emotional Tribute to RRR Actor Ray Stevenson
x

Ray Stevenson: స్కాట్ దొర మరణంపై జక్కన్న ఎమోషనల్ ట్వీట్

Highlights

Ray Stevenson: ఈ ఐరిష్ నటుడు మరణంతో RRR టీమ్ తీవ్ర దిగ్ర్భాంతికి గురైంది.

Ray Stevenson: RRR లో స్కాట్ దొరగా విలనీ పండించిన ఐరిష్ నటుడు రే స్టీవెన్సన్(58) హఠన్మరణం టాలీవుడ్ లో సైతం విషాదం నింపింది. ఈ ఐరిష్ నటుడు మరణంతో RRR టీమ్ తీవ్ర దిగ్ర్భాంతికి గురైంది. కార్తికేయ, ఎన్టీఆర్, రాజమౌళి వరుస ట్వీట్లతో రే స్టీవెన్సన్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. రే స్టీవెన్సన్ మరణవార్త షాక్ కు గురి చేసిందని..ఆయనతో పని చేయడం గొప్ప అనుభవాన్ని ఇచ్చిందని..ఈ కష్ట సమయంలో రే స్టీవెన్సన్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని వెల్లడించారు. దర్శకధీరుడు రాజమౌళి సైతం తన సంతాపాన్ని తెలియజేశారు. రే సెట్స్ లో తనకు ఎనర్జీని, చైతన్యాన్ని తీసుకువచ్చారని అలాంటి వ్యక్తి లేరనే వార్తను నమ్మలేకపోతున్నానని రాజమౌళి ట్వీట్ చేశారు. ఆయనతో పని చేసినందుకు ఆనందంగా ఉందని..ఈ కష్ట సమయంలో తన ప్రార్థనలు రే కుటుంబసభ్యులతో ఉన్నాయని తెలిపారు.

ఐరిష్ ఫిలిమ్ ఇండస్ట్రీకి చెందిన రే స్టీవెన్ సన్ థోర్ సిరీస్ తో పాపులారిటీని సంపాదించుకున్నారు. కింగ్ అర్థర్, ది అదర్ గైస్, ది ట్రాన్స్ పోర్టర్, యాక్సిడెంట్ మ్యాన్ వంటి చిత్రాలు ఆయనకు క్రేజ్ తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఆయన క్యాసినో ఇన్ ఇస్చీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ లోనే అనారోగ్యానికి గురైన రే కన్నుమూశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories