Raj Tarun: స్టాండ్ అప్ కమెడీయన్‌గా రాజ్‌ తరుణ్!

Raj Tarun turns as stand up comedian
x

రాజ్ తరుణ్ (ఫొటో ట్విట్టర్)

Highlights

Raj Tarun: యంగ్ హీరో రాజ్ తరుణ్ స్టాండ్ అప్ కమెడీయన్‌గా మారాడంట.

Raj Tarun: యంగ్ హీరో రాజ్ తరుణ్ స్టాండ్ అప్ కమెడీయన్‌గా మారాడంట. తన నూతన సినిమా "స్టాండ్‌ అప్ రాహుల్‌" తో ప్రేక్షకులను నవ్వించేందుకు సిద్ధమయ్యాడంట. ఈ సినిమాకు శాంటో మోహన్ వీరంకి దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం రాజ్ తరుణ్ కి ఓ విజయం చాలా అవసరం. అందుకే ఈ సారి కామెడీని నమ్ముకున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో "మిడిల్ క్లాస్ మెలోడీస్" ఫేమ్ వర్షా బొల్లమ్మ హీరోయిన్‌ గా నటిస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్‌తో అంచనాలు పెంచారు మూవీ యూనిట్. తాజాగా రాజ్ తరుణ్ పుట్టినరోజు సందర్భంగా ఓ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది.

ఈ పోస్టర్ లో రాజ్ తరుణ్ కూర్చుని పైకి చేస్తుంటాడు. అతని పైన మైక్‌లు వేలాడుతూ ఉంటాయి. సో మొత్తానికి ఈ సారి రాజ్‌ తరుణ్‌ నుంచి మంచి కామెడీని చూడొచ్చన్నమాట. తొలిసారి ఇలాంటి పాత్రను పోషిస్తున్నాడు రాజ్‌ తరుణ్‌. అలాగే ఈ సినిమాలో అన్ని వర్గాలకు సంబంధించిన అంశాలు ఉంటాయని మేకర్స్ వెల్లడిస్తున్నారు. చాలా వినోదాత్మకంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాను

డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్, హైఫైవ్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు స్వీకర్ అగస్తి సంగీతం అందిస్తున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories