Radhe Shyam: ప్రమోషన్లు మొదలు పెట్టనున్న "రాధే శ్యామ్" బృందం

Radhe Shyam Movie Team to Launch Promotions | Tollywood News
x

Radhe Shyam: ప్రమోషన్లు మొదలు పెట్టనున్న "రాధే శ్యామ్" బృందం

Highlights

Radhe Shyam: ఈవెంట్ ప్లాన్ చేస్తున్న "రాధే శ్యామ్" బృందం

Radhe Shyam: రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా "రాధే శ్యామ్". రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. జనవరి 14 న విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. తాజాగా ఈ సినిమాని మార్చి విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ మధ్యనే విడుదలైన ఈ రాతలే పాట టీజర్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక తాజాగా అభిమానులు అందరూ ఈ చిత్ర ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరోవైపు చిత్రబృందం సినిమాని విడుదల చేసేందుకు మరియు ప్రమోషన్స్ ను మొదలు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే వరుసగా ఇంటర్వ్యూలో కూడా పాల్గొనడానికి సిద్ధమవుతున్నారు నటీనటులు. మరోవైపు చిత్రబృందం సినిమా వీడియో సాంగ్ ప్రోమో లను ఐదు వివిధ భాషల్లో విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా ఈవెంట్ను ముంబైలో గ్రాండ్గా నిర్వహించాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇంకా తేదీ ఖరారు కాకపోయినప్పటికీ మార్చి మొదటి వారంలో ఈవెంట్ జరగబోతున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories