సీఎం కేసీఆర్ కు సినీ నిర్మాత నట్టి కుమార్ లేఖ!

సీఎం కేసీఆర్ కు సినీ నిర్మాత నట్టి కుమార్ లేఖ!
x
Highlights

తెలంగాణలో థియేటర్లు తెరచి కార్మికులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను సినీ నిర్మాత నట్టి కుమార్ కోరారు. రాష్ట్రంలో థియేటర్లను తెరవకపోవడం వల్ల ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా 50 వేల మంది కార్మికులు రోడ్డున పడ్డారని తెలిపారు.

తెలంగాణలో థియేటర్లు తెరచి కార్మికులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను సినీ నిర్మాత నట్టి కుమార్ కోరారు. రాష్ట్రంలో థియేటర్లను తెరవకపోవడం వల్ల ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా 50 వేల మంది కార్మికులు రోడ్డున పడ్డారని తెలిపారు. థియేటర్ లీజు ఓనర్లు కార్మికులకు 8 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని, దీనిపై సమగ్ర విచారణ చేపట్టి కార్మికులకు జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. థియేటర్లను తెరిచేందుకు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్న నట్టి కుమార్.. తెలంగాణలో కూడా ఇస్తే రెండు రాష్ట్రాల్లో ఒకే సారి విడుదల చేయడానికి వీలవుతుందని సీఎం కేసీఆర్ కు ఓ ప్రకటన ద్వారా వివరించారు.అటు కరోనా కట్టడిలో భాగంగా లాక్ డౌన్ విధించడంతో ధియెటర్లు మూతపడిన సంగతి తెలిసిందే!

Show Full Article
Print Article
Next Story
More Stories