ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో షూటింగ్స్ సాధ్యం కాదు : సి.కల్యాణ్

ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో షూటింగ్స్ సాధ్యం కాదు : సి.కల్యాణ్
x
Highlights

Producer C Kalyan Comments on Shootings: సినిమా షూటింగ్‌లకు సంబంధించి కేంద్రం పచ్చజెండా ఊపింది. సినిమా, టీవీ షూటింగులకు కేంద్రం అనుమతులు...

Producer C Kalyan Comments on Shootings: సినిమా షూటింగ్‌లకు సంబంధించి కేంద్రం పచ్చజెండా ఊపింది. సినిమా, టీవీ షూటింగులకు కేంద్రం అనుమతులు జారీ చేసింది. అన్‌లాక్‌ 3.0లో భాగంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మార్గదర్శకాల్లో భాగంగా సినిమా, టీవీ కార్యక్రమాల షూటింగ్‌లకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా షూటింగ్‌లు నిర్వహించుకోవచ్చని తెలిపింది. తక్కువ సిబ్బందితో సినిమా, టీవీ షూటింగ్‌లు జరుపుకోవాలని కేంద్రం సూచించింది.

సినిమా షూటింగ్‌లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై టాలీవుడ్ నిర్మాత సి.కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నిర్ణయంతో ఎటువంటి ఉపయోగమూ లేదని ఆయన అన్నారు. ప్రభుత్వ విధివిధానాలతో షూటింగ్స్ ప్రారంభమయ్యే పరిస్థితి లేదని, దీనికి కారణం షూటింగ్స్ లో భౌతికదూరం పాటించలేమని, నటీనటులు మాస్క్ లు వేసుకుని నటించలేరని ఆయన అన్నారు. కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ వచ్చేదాకా ధైర్యంగా నటీనటులు సెట్స్ మీదకు వచ్చే అవకాశం కనిపించడం లేదని ఆయన అన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories