Priya Prakash Varrier: సక్సెస్ కోసం ప్రియా వారియర్ ఎదురుచూపు

Priya Prakash Varrier To Act With Dhruv Vikram
x
ప్రియా ప్రకాష్ వారియర్ (ఫొటో ట్విట్టర్)
Highlights

Priya Prakash Varrier: ప్రియా ప్రకాష్ వారియర్ వరుస ఆఫర్లతో చాలా బిజీగా మారుతోంది.

Priya Prakash Varrier: ప్రియా ప్రకాష్ వారియర్ వరుస ఆఫర్లతో చాలా బిజీగా మారుతోంది. 'ఒరు అదార్ లవ్' సినిమాతో దేశవాప్తంగా పేరు సంపాదించిన ఈ నటి.. ఆ సినిమా విడుదలకు ముందే స్టార్ గా మారిపోయింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రం విఫలమైంది. ఈ సినిమాను తెలుగులో 'లవర్స్ డే' పేరుతో విడుదల చేసినా.. ఫలితం లేకుండా పోయింది.

ఆ తరువాత నితిన్ కు జోడీగా చెక్ సినిమాలోనూ నటించింది. కానీ, ఈ సినిమా కూడా తనకు విజయాన్ని అందించలేకపోయింది. అయినా అవకాశాలు మాత్రం ఆగలేదు. తేజతో కలిసి 'ఇష్క్' అనే సినిమా చేసింది. ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు.

తమిళ స్టార్ హీరో విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ నటించే తదుపరి సినిమాలో ప్రియా వారియర్ హీరోయిన్‌గా చేస్తోందని సమాచారం. హీరోహీరోయిన్ల మధ్య ఓ ఫోటోషూట్ కూడా నిర్వహించారనే టాక్‌ కూడా బలంగా వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ వార్తే నిజమైతే.. తమిళంలో ప్రియా వారియర్‌కు గ్రాండ్ సక్సెస్ దక్కే అవకాశం ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. అలాగే తెలుగులోనూ ఓ సినిమాలో చేస్తుందని, ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories