"రాజా డీలక్స్" చేయ్యాలా వద్దా అని ఆలోచిస్తున్న ప్రభాస్

DVV Danayya had Suspicions About the Director Maruthi
x

"రాజా డీలక్స్" చేయ్యాలా వద్దా అని ఆలోచిస్తున్న ప్రభాస్

Highlights

"రాజా డీలక్స్" విషయంలో నిర్మాతకి డైరెక్టర్ పై మొదలైన అనుమానాలు..

Prabhas: ఈ మధ్యనే "రాధే శ్యామ్" సినిమాతో డిజాస్టర్ అందుకున్న ప్రభాస్ చేతిలో ఇప్పుడు బోలెడు బడా ప్రాజెక్టులో ఉన్నాయి. ఒక వైపు పలు పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్న ప్రభాస్ మారుతీ దర్శకత్వంలో కూడా ఒక చిన్న బడ్జెట్ సినిమా చేయడానికి సైన్ చేశారు. హారర్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకి "రాజా డీలక్స్" అనే టైటిల్ ని కూడా ఖరారు చేశారు దర్శకనిర్మాతలు.

సినిమా ప్రకటించినప్పుడు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ రాను రాను అంచనాలు తగ్గిపోతూ వస్తున్నాయి. దానికి కారణం మారుతి ఈ మధ్యనే దర్శకత్వం వహించిన "పక్కా కమర్షియల్" సినిమా. గోపీచంద్ మరియు రాశిఖన్నాలు హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో నిర్మాత డివివి దానయ్యకు కూడా మారుతి ప్రభాస్ స్టార్ డం ను హ్యాండిల్ చేయలేడేమోనని అనుమానాలు మొదలయ్యాయట.

మరోవైపు ప్రభాస్ కూడా "రాజా డీలక్స్" సినిమా చేయాలా లేదా అని, ప్రస్తుతం కెరియర్ లో ఈ సమయంలో ఒక హారర్ కామెడీ సినిమా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అని ఇలా పలు రకాలుగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో "సలార్" మరియు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో "ప్రాజెక్ట్ కే" సినిమాలు పూర్తయ్యకే ప్రభాస్ దీనికి సంబంధించిన ఒక నిర్ణయానికి రానున్నారు. మరోవైపు ప్రభాస్ ఓం రౌత్ దర్శకత్వంలో "ఆది పురుష్", సందీప్ వంగా దర్శకత్వంలో "స్పిరిట్" సినిమాలతో కూడా బిజీగా ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories