Prabhas: "ఆది పురుష్" విడుదల వాయిదా కి కారణం అదేనా?

Prabhas Adipurush Release Postponed
x

Prabhas: "ఆది పురుష్" విడుదల వాయిదా కి కారణం అదేనా?

Highlights

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న "ఆది పురుష్" సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న "ఆది పురుష్" సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రామాయణం ఆధారంగా తెరకెక్కనుంది. ఈ సినిమా జనవరి 12న విడుదలవుతుంది అని చిత్ర బృందం ప్రకటించింది. కానీ సంక్రాంతి బరిలో ఇప్పటికే బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న "వీరసింహారెడ్డి" మరియు మెగాస్టార్ చిరంజీవి హీరోగా కె ఎస్ రవీంద్ర అలియాస్ బాబీ డైరెక్షన్లో నటిస్తున్న "వాల్తేరు వీరయ్య" సినిమాలు లైన్లో ఉన్నాయి.

కాబట్టి "ఆది పురుష సినిమా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అందరూ అనుకున్నారు. అయితే అందరూ అనుకున్నట్టుగానే ఆది పురుష్ సినిమా వచ్చే ఏడాది వేసవికి వాయిదా పడింది అయితే దీనికి కారణం వేరొకటి ఉందట. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ కు ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ లభించింది. చాలా వరకు అభిమానులు సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ ఏ మాత్రం బాగోలేదని కార్టూన్స్ లాగా ఉన్నాయని ప్రభాస్ అభిమానులు దర్శక నిర్మాతల పై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సినిమా విజువల్ ఎఫెక్ట్స్ పై మరొకసారి పని చేయనుందట.

టీజర్ కు ప్రేక్షకుల నుండి నెగటివ్ రెస్పాన్స్ రావడంతో దర్శక నిర్మాతలపై బాగా ప్రెషర్ పడడంతో వారు సినిమా విజువల్స్ మొత్తాన్ని రీడూ చేయాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం దాదాపు 100 కోట్ల దాకా ఖర్చవ్వబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సినిమా విడుదల కూడా వాయిదా పడింది. కృతి సానన్ సీత పాత్రలో, సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడి పాత్రలో, సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రలలో నటిస్తున్నారు. టి సిరీస్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకి అజయ్ అతుల్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories