నిర్మాతలకు అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయనున్న పవన్ కళ్యాణ్

Pawan Kalyan Return the Advances to Producers
x

నిర్మాతలకు అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయనున్న పవన్ కళ్యాణ్

Highlights

Pawan Kalyan: "వకీల్ సాబ్" సినిమాతో మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్...

Pawan Kalyan: "వకీల్ సాబ్" సినిమాతో మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ "భీమ్లా నాయక్" సినిమాతో మరొక సూపర్ హిట్ ని అందుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఈ సారి సేఫ్ గా రీమేక్ సినిమాలు మాత్రమే ప్లాన్ చేస్తున్నారు. "వకీల్ సాబ్", "భీమ్లా నాయక్" తర్వాత ఇప్పుడు మరొక రీమేక్ సినిమాని చేయడానికి సిద్ధమవుతున్నారు పవన్ కళ్యాణ్. తమిళంలో సూపర్ హిట్ అయిన "వినోదయ సితం" అనే సినిమా తెలుగు రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు.

మరోవైపు క్రిష్ దర్శకత్వంలో "హరిహర వీరమల్లు" మరియు హరిశంకర్ డైరెక్షన్లో "భవదీయుడు భగత్ సింగ్" సినిమాలు కూడా పూర్తి చేయాల్సి ఉంది. ఇది మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ మరికొన్ని సినిమాలకు సైన్ చేశారు. కానీ 2024 ఎలక్షన్లు దగ్గర పడుతుండడంతో "జనసేన" పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయ పనులకు సమయాన్ని కేటాయించాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఒక రెండేళ్ల పాటు రాజకీయ పనుల మీదే దృష్టి పెట్టాలని అనుకుంటున్న పవన్ కళ్యాణ్ సినిమాల నుంచి మళ్లీ ఒకసారి లాంగ్ బ్రేక్ తీసుకోబోతున్నారు.

ఈ నేపథ్యంలోనే కొంతమంది నిర్మాతలకు తాను తీసుకున్న అడ్వాన్స్ రెమ్యోనరేషన్ ని తిరిగి ఇచ్చేద్దామని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. తనవల్ల నిర్మాతలకు ఆర్థిక ఇబ్బందులు కలగకుండా పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories