BRO: పవన్ పేరు చెప్పి వంద కోట్లు.. వాటీజ్ దిస్ బ్రో..??

One Hundred Crores By Mentioning Pawan Name
x

BRO: పవన్ పేరు చెప్పి వంద కోట్లు.. వాటీజ్ దిస్ బ్రో..??

Highlights

* బ్రో మూవీ థియెట్రికల్ బిజినెస్ షాక్ ఇచ్చే రేంజ్ లో ఉంది. ఈ మూవీకి 100 కోట్ల బిజినెస్ జరుగుతుందని సమాచారం. కేవలం 15 నుంచి 20 నిమిషాలు మాత్రమే పవన్ ఈ చిత్రంలో కనిపించనున్నారు. అలాంటి ఈ సినిమాకు సైతం 100 కోట్ల బిజినెస్ జరగడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

BRO: మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో కలిసి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేస్తున్న మల్టి స్టారర్ మూవీ బ్రో. తమిళంలో సూపర్ హిట్టైన వినోదయ సీతం చిత్రానికి రీమేక్ గా దర్శకుడు సముద్రఖని బ్రో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన మోషన్ పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేసింది. ఈ సినిమాని పీపుల్స్ మీడియా బ్యానర్ తో కలిసి జీ స్టూడియోస్ నిర్మిస్తుండగా ప్రస్తుతం ఈ సినిమా బిజినెస్ ను మేకర్స్ ప్రారంభించారు. బ్రో మూవీ ఓటీటీ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ 40 కోట్ల రూపాయల భారీ మొత్తం ఇచ్చి సొంతం చేసుకోగా 100 కోట్ల రూపాయల థియెట్రికల్ బిజినెస్ జరుపుకుంటున్నట్లు సమాచారం..

ఆంధ్రప్రదేశ్ మరియు సీడెడ్ ప్రాంతానికి కలిపి ఈ చిత్రానికి దాదాపుగా 55 కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతోందట. అలాగే నైజాం ప్రాంతంలో 30 కోట్లు, కర్ణాటక, ఓవర్సీస్ ప్రాంతాలకు కలిపి 15 కోట్లు మొత్తంగా 100 కోట్ల రూపాయల బిజినెస్ ని ఈ చిత్రం జరుపుకుంటున్నట్లు సమాచారం. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే, బ్రో సినిమాలో పవన్ హీరో కాదు..సాయిధరమ్ తేజ్ మెయిన్ లీడ్, పవన్ గెస్ట్ రోల్ మాత్రమే చేస్తున్నారు. ఆయన పాత్రకు రన్ టైమ్ మహా అయితే ఇరవై నిమిషాలు ఉంటుంది. గెస్ట్ రోల్ కంటే కాస్త ఎక్కువ అన్నట్లు ఉండే పవన్ రోల్ చూపించి మేకర్స్ 100 కోట్లు లాగేస్తున్నారు.

సాయిధరమ్ తేజ్ మార్కెట్ కేవలం 30 నుంచి 40 కోట్లు మాత్రమే ఉంది. కానీ, పవన్ ఉన్నాడు కదా అని బ్రో థియెట్రికల్ బిజినెస్ ను 100 కోట్లు పలికిస్తున్నారు. పవన్ కల్యాణ్ కెరీర్ లో ఇంకా 100 కోట్ల షేర్ మూవీ పడలేదు. కానీ పవన్ చిత్రాలకు మాత్రం 100 కోట్ల థియేట్రికల్ బిజినెస్ అవుతుంది. పవన్ ఉన్నాడనే ధైర్యంతో ఆయన సినిమాలను బయ్యర్లు భారీ రేట్లు పెట్టి కొనుగోలు చేస్తుంటారు. సినిమా ఫ్లాపైనా పవన్ ఏదోఒకరకంగా నష్టపరిహారం చెల్లించేలా చేస్తారనేది వారి నమ్మకం. భీమ్లా నాయక్ విషయంలో అదే జరిగింది. మరి బ్రో మూవీ ఎలాంటి ఫలితం ఇస్తుందో అని ఇండస్ట్రీ వర్గాలు ఇప్పటి నుంచే ఆసక్తి చూపిస్తున్నాయి. ఇక బ్రో మూవీ జూలై 28న విడుదల కానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories