RRR Heroes: చరణ్, తారక్ కు మరో అరుదైన గౌరవం.. జపాన్ మ్యాగజైన్ కవర్ పేజ్ పై RRR హీరోలు

NTR And Charan On Cover Page Of Japanese Magazine
x

RRR Heros: చరణ్, తారక్ కు మరో అరుదైన గౌరవం.. జపాన్ మ్యాగజైన్ కవర్ పేజ్ పై RRR హీరోలు

Highlights

* RRR మూవీ జపాన్ లో సైతం సంచలన విజయం సాధించిన విషయం మనకు తెలిసిందే. భారీ కలెక్షన్లు సాధించడమే కాకుండా ఎన్నో రికార్డులను తిరగరాసింది

RRR Heroes: ఆర్ ఆర్ ఆర్ మూవీతో రాంచరణ్, ఎన్టీఆర్ ఇద్దరు గ్లోబల్ స్టార్లుగా ఎదిగారు. ఈ సినిమాతో వాళ్ల రేంజ్ ఇంటర్నేషన్ స్థాయికి చేరింది. దీంతో బాలీవుడ్ మాత్రమే కాదు హాలీవుడ్ సైతం చరణ్, తారక్ తో సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తోంది. వీరిని ఇప్పటికే పలు అంతర్జాతీయ ప్రొడక్షన్ హౌస్ లు సంప్రదించాయి. ఆర్ ఆర్ ఆర్ సినిమాని జపాన్ లో రిలీజ్ చేసిన సందర్భంగా ఆ దేశంలో చరణ్, తారక్ ప్రమోషన్స్ నిర్వహించగా అక్కడివారు మన హీరోలపై ఎనలేని అభిమానాన్ని కురిపించారు.

ప్రమోషన్స్ లో భాగంగా జపాన్ వీధుల్లో రామ్ చరణ్, ఎన్టీఆర్ సతీసమేతంగా సందడి చేసిన విషయం మనకు తెలిసిందే. గులాబీ పువ్వులను చేతిలో పట్టుకొని, ఒకరి చేతిలో ఒకరు చేయివేసుకొని జపాన్ వీధుల్లో ముందుకు సాగిన వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. ఈ వీడియో ఇప్పటికీ చక్కర్లు కొడుతూనే ఉంది. జపాన్ లో పర్యటించిన ఎన్టీఆర్, చరణ్ ను చూసేందుకు అక్కడి అభిమానులు తెగ పోటీపడ్డారు. ఆర్ ఆర్ ఆర్ మూవీ జపాన్ లో విడుదలై 200 రోజులు పూర్తి చేసుకున్నా ఇప్పటికీ దిగ్విజయంగా ప్రదర్శితమౌతోంది.

ఇదిలాఉంటే, జపాన్ కు చెందిన ఓ ప్రముఖ లైఫ్ స్టయిల్ మ్యాగజైన్ అనన్.... మన చరణ్, తారక్ ఫోటోలను తమ తాజా ఎడిషన్ కవర్ పేజ్ పై ముద్రించింది. ఈ విషయాన్ని ఆర్ ఆర్ ఆర్ చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. మ్యాగజైన్ కవర్ పేజ్ ని షేర్ చేసింది. ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ మ్యాగజైన్ కవర్ పేజ్ పిక్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories