Nani: ఇది మనందరి విజయం అంటున్న నాని

Nani Says this is the Greatest Movie I have Ever Made in My Career
x

Nani: ఇది మనందరి విజయం అంటున్న నాని

Highlights

Nani: ఇది మనందరి విజయం అంటున్న నాని

Nani: నాచురల్ స్టార్ నాని మరియు మలయాళం బ్యూటీ నజ్రియా నజీం లు హీరోహీరోయిన్లుగా నటించిన "అంటే సుందరానికి" సినిమా ఈ మధ్యనే భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలై మిశ్రమ ఫలితాలను అందుకుంటోంది. వివేక్ ఆత్రేయ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా రన్ టైం బాగా ఎక్కువగా ఉండటంతో సినిమాలో లాగ్ ఎక్కువగా ఉందని కొన్ని సన్నివేశాలను కత్తిరిస్తే ఇంకా బాగుంటుందని చాలా మంది తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు దర్శక నిర్మాతలు.

కానీ ఫ్లాప్ సినిమాకి సెలబ్రేషన్ ఏంటి అంటూ అభిమానులు సైతం షాక్ అయ్యారు. ఈ నేపథ్యంలో సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ, "సినిమా విడుదలైన మూడు రోజులకే సక్సెస్ సెలబ్రేషన్స్ ఏంటి అని అందరూ చాలామంది అంటున్నారు కానీ మేము సెలబ్రేట్ చేసుకుంటుంది కలెక్షన్లను కాదు మాకు దక్కిన హార్ట్స్ ని" అని అన్నారు నాని. "సినిమాకి చూసిన వాళ్లు చాలా బాగా ఎంజాయ్ చేశారు. అందుకే మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాము. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయిందా లేదా అనే విషయాన్ని పక్కన పెట్టేస్తే మంచి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. అందులో అంటే సుందరానికి ఒకటి" అని అన్నారు నాని.

అంతేకాకుండా ఏదైనా కొత్తగా సినిమాని ట్రై చేసినప్పుడు దానిని ఒక మాస్ మూవీ తో పోల్చడం మంచిది కాదని, ఒక మంచి సినిమా వచ్చినప్పుడు వారి భుజాల మీద ఎత్తుకొని దాన్ని ముందుకు తీసుకెళ్తే తెలుగు సినిమా వేస్తున్న కొత్త అడుగులో మనం కూడా భాగం అవుతామని అన్న నాని ఈ సినిమా అందరూ సెలబ్రేట్ చేసుకోవాల్సిన సినిమా అని, ఇది అందరి విజయమని అన్నారు. "ఒక పదేళ్ళ తర్వాత నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నా కెరీర్లో నేను చేసిన గొప్ప సినిమాలలో అంటే సుందరానికి కూడా ఒకటి అని నేను గర్వంగా చెప్పుకోగలను. ఇలాంటి కథలు చెప్పడానికి చాలా గట్స్ కావాలి అవి మా వివేక్ లో ఉన్నాయి. ఇది ఒక క్లాసిక్ సినిమా" అని అన్నారు నాని.

Show Full Article
Print Article
Next Story
More Stories