మరొక సీనియర్ హీరోతో చేయి కలపనున్న రాజశేఖర్

మరొక సీనియర్ హీరోతో చేయి కలపనున్న రాజశేఖర్
x
Highlights

తమిళంలో సూపర్ హిట్ అయిన సినిమాలను తెలుగులోకి తెలుగులో హిట్ అయిన సినిమాలను తమిళంలోకి రీమేక్ చేసిన సందర్భాలు చాలానే చూసాము. ఇప్పుడు ఈ జాబితాలో కొత్తగా...

తమిళంలో సూపర్ హిట్ అయిన సినిమాలను తెలుగులోకి తెలుగులో హిట్ అయిన సినిమాలను తమిళంలోకి రీమేక్ చేసిన సందర్భాలు చాలానే చూసాము. ఇప్పుడు ఈ జాబితాలో కొత్తగా చేరనున్న సినిమా 'విక్రమ్ వేద'. యాక్షన్ థ్రిల్లర్ గా ఆర్ మాధవన్ మరియు విజయ్ సేతుపతి ముఖ్య పాత్రలో కనిపించిన 'విక్రమ్ వేద' సినిమా తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. పుష్కర్ గాయత్రి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. సాం సీఎస్ సంగీతం అందించిన ఈ సినిమా ఈ సినిమాకు మరింత ప్లస్ అయింది. శ్రద్ధా శ్రీనాధ్, వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాలో హీరోయిన్లు గా కనిపించారు.

గత కొంత కాలంగా ఈ సినిమా ను తెలుగులో రీమేక్ చేయనున్నారు అనే వార్తలు చాలానే బయటకు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రీమేక్ లో సీనియర్ హీరోలు నందమూరి బాలకృష్ణ మరియు రాజశేఖర్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. బాలయ్య ఒకవైపు ఎన్నికలు మరొకవైపు బోయపాటి సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రాజశేఖర్ కూడా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో 'కల్కి' సినిమా తో బిజీగా ఉన్నారు. మొత్తానికి ఎలక్షన్స్ పూర్తయిన తరువాతే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వెలువడుతుందని చెప్పచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories