మిస్టర్ మజ్ను డబ్బింగ్ షురూ

Mr Majnu
x
Mr Majnu
Highlights

అక్కినేని యువ హీరో అఖిల్ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకుంటాడు అనుకుంటే 'అఖిల్' సినిమా కాస్తా డిజాస్టర్ గా మారింది. తరువాత నటించిన 'హలో' సినిమా పర్వాలేదు అనిపించినప్పటికీ కలెక్షన్ల పరంగా పెద్దగా హిట్ అవ్వలేదని చెప్పుకోవాలి.

అక్కినేని యువ హీరో అఖిల్ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకుంటాడు అనుకుంటే 'అఖిల్' సినిమా కాస్తా డిజాస్టర్ గా మారింది. తరువాత నటించిన 'హలో' సినిమా పర్వాలేదు అనిపించినప్పటికీ కలెక్షన్ల పరంగా పెద్దగా హిట్ అవ్వలేదని చెప్పుకోవాలి. ఇక మూడవ సినిమాతో ఈసారి కచ్చితంగా హిట్ అందుకోవాలనే కసితో మన ముందుకు వస్తున్నాడు. 'తొలిప్రేమ' ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'మిస్టర్ మజ్ను' సినిమాలో నటిస్తున్నాడు అఖిల్. ప్లే బాయ్ గా ఈ సినిమా లో అఖిల్ కనిపించనున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తి అయిపోయింది.

నాగ చైతన్య తో 'సవ్యసాచి' లో రొమాన్స్ చేసిన నిధి అగర్వాల్ ఈ సినిమాలో అఖిల్ సరసన నటిస్తుంది. ఈ సినిమా డబ్బింగ్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. అఖిల్ ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్ పనులతో బిజీగా ఉన్నాడు. ఈ విషయాన్ని తనే ఇంస్టాగ్రామ్ ద్వారా ఒక ఫోటోని షేర్ చేస్తూ తెలియజేశారు. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మాణంలో జనవరి 25 న తెరకెక్కనున్న ఈ సినిమాకు తమన్ సంగీతం కూర్చారు. మరి ఈ సినిమా అయినా అఖిల్ కు మంచి హిట్ ను అందిస్తుందో లేదో వేచి చూడాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories